పాకిస్థాన్‌లోని మరో ఉగ్ర దాడి జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో ఏడుగురు సైనికులు మృతి చెందారని సైన్యం ప్రకటించింది.
బలూచిస్థాన్ రాష్ట్రంలో హర్నోయ్ ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారని సైనికాధికారులు తెలిపారు. అయితే సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందినట్లు ప్రకటించారు.
కాల్పులకు తెగబడ్డ వారు బలూచిస్థాన్ వేర్పాటువాదులని పేర్కొన్నారు. బలూచ్‌లో శాంతి విఘాతాలకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. దాడులకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
దాడి జరగడం బాధాకరం
ఉగ్ర దాడిని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. దాడి జరగడం బాధాకరం అని అన్నారు. సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్ చేస్తున్న తీవ్రవాదులు గత కొద్ది కాలంగా ఆ రాష్ట్రంలోని సైనికబలగాలపై దాడులు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ భారీ కుట్ర