జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఈయూ(ఐరోపా సమాఖ్య)ను ఆశ్రయించింది జర్మనీ. ఈ సమాఖ్యలోని 28 దేశాలు తమ ప్రతిపాదనకు మద్దతివ్వాలని కోరింది.
ఇప్పటికే ఈయూలోని పలు దేశాలు జర్మనీకి మద్దతుగా నిలిచాయి. కానీ ఈ అంశంపై ఐరోపా సమాఖ్య ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా చైనా తిరస్కరించిన కొద్ది రోజులకే... ఈయూలో జర్మనీ ఈ ప్రతిపాదనను తేవటం విశేషం.
28 దేశాల్లో మసూద్‌కు నో ఎంట్రీ
ఈ మేరకు ఈయూ నిర్ణయం తీసుకుంటే... 28 దేశాల్లో అడుగుపెట్టేందుకు మసూద్‌కు దారులు మూసుకుపోతాయి. అజార్ ఆస్తులను ఆయా దేశాలు జప్తు చేస్తాయి.
ఐక్యరాజ్య సమితిలో చైనా అడ్డుకట్ట
మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని మార్చి 15న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) లో ఫ్రాన్స్ ప్రతిపాదించింది.