ETV Bharat / international

వార్తలకు డబ్బులిచ్చేలా గూగుల్ భారీ ఒప్పందం - మీడియా సంస్థలకు గూగుల్, ఫేస్​బుక్ చెల్లింపు చట్టం

ఆస్ట్రేలియాలో డబ్బులిచ్చి వార్తలను పొందాలన్న నిబంధన తప్పనిసరి కానున్న నేపథ్యంలో గూగుల్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో అతిపెద్ద మీడియా సంస్థతో 'ఫే ఫర్​ జర్నలిజం' ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్​, ఫేస్​బుక్​ కొత్త నిబంధనను అంగీకరించేందుకు దాదాపు సిద్ధమైనట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది.

Google, Fb pay to media deal
మీడియా సంస్థలకు డబ్బులు చెల్లించే ఒప్పంద
author img

By

Published : Feb 15, 2021, 3:15 PM IST

ఆస్ట్రేలియాలో తప్పనిసరి కానున్న.. 'పే ఫర్​ జర్నలిజం'లో భాగంగా గూగుల్​తో ఒప్పదం కుదుర్చుకున్న అతిపెద్ద మీడియా సంస్థగా సెవెన్​ వెస్ట్ మీడియా నిలిచింది. దీనికి సంబంధించిన ముసాయిదా మంగళవారం పార్లమెంట్​ ముందుకు వెళ్లనుండగా.. సోమవారమే ఈ ఒప్పదంపై గూగుల్​, సెవెన్​ వెస్ట్ మీడియా సంయుక్త ప్రకటన చేశాయి.

ఈ ఒప్పందం విలువ ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. మరో మీడియా సంస్థ నైన్​ ఎంటర్​టైన్మెంట్ ఆ ఒప్పందం విలువ ఏడాదికి 30 ఆస్ట్రేలియన్ మిలియన్​ డాలర్లుగా పేర్కొంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆల్ఫాబెట్​ (గూగుల్ మాతృసంస్థ) సీఈఓ సుందర్​ పిచాయ్, ఫేస్​బుక్​ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్​, మీడియా సంస్థల అధికారుల మధ్య తాజాగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.

ఏమిటి ఈ పే ఫర్ జర్నలిజం?

గూగుల్​, ఫేస్​బుక్​లు తమ ప్లాట్​ఫామ్​లపై చూపించే వార్తలకు గానూ సంబంధిత వార్తా సంస్థకు డబ్బు చెల్లించాలనేదే ఈ పే ఫర్​ జర్నలిజం. గత ఏడాది ఈ ప్రతిపాదనను ఆయా సంస్థల ముందుకు తీసుకొచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. దీనిని తమ దేశంలో తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఈ విధంగా జర్నలిజంకు డబ్బులు అందించేందుకు చట్టం రూపొందించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

కొత్త ప్రతిపాదనపై గూగుల్, ఫేస్​బుక్​లు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశాయి. డబ్బులు చెల్లించే బదులు.. ఆస్ట్రేలియా వార్తల కంటెంట్​ను నిషేధిస్తామని ఎఫ్​బీ హెచ్చరించింది. ఈ ప్రతిపాదిత చట్టానికి ఆమోదం లభిస్తే.. గూగుల్​ సెర్చ్​తో పాటు యూట్యూబ్​ సేవలు ఆధ్వానంగా ఉంటాయని తేల్చిచెప్పింది గూగుల్​. అయితే తాజా చర్చల అనంతరం ఈ చట్టాలనికి ఇరు సంస్థలు సముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గూగుల్​ న్యూస్​ షోకేస్​ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 450 చిన్న చిన్న సంస్థలతో చెల్లింపు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవీ చదవండి:'అలా చేస్తే గూగుల్ సేవలను నిలిపేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.