ETV Bharat / international

మిడతల నివారణకు భారత్ ​వైపు పాక్​ చూపు! - మిడతల నివారణకు భారత క్రిమిసంహారకాల దిగుమతికి పాక్ సిద్ధం

పాకిస్థాన్​లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో మిడతల దండు విధ్వంసంతో సతమతమవుతున్న అక్కడి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మిడతలను నివారించడానికి భారత్ ​వైపు చూస్తోంది. ఇందుకోసం భారత్​పై విధించిన వాణిజ్య ఆంక్షలను సడలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Locust
మిడతల
author img

By

Published : Feb 18, 2020, 11:39 AM IST

Updated : Mar 1, 2020, 5:09 PM IST

మిడతల దండు విధ్వంసంతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ వాటిని అదుపుచేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. దీనికోసం భారత్​పై విధించిన వాణిజ్య ఆంక్షలను సడలించడానికి సిద్ధమవుతోంది.

భారత్​ నుంచి క్రిమిసంహారకాలను దిగుమతి చేసుకోవడానికి ఆంక్షలకు ఒకసారి మినహాయింపు ఇచ్చేందుకు పాక్​ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అక్కడి డాన్ పత్రిక వెల్లడించింది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించినట్లు పేర్కొంది.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్​-370ని కేంద్ర ప్రభుత్వం ​రద్దు చేసిన అనంతరం భారత్​తో వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది పాక్. ఏడు నెలల అనంతరం ఈ ఆంక్షలను సడలించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మిడతలతో యుద్ధం

కొంత కాలంగా మిడతల దాడితో పాక్​లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాలలో దశాబ్ద కాలంగా కనీవినీ ఎరుగని విధంగా పంట నష్టం జరిగింది. దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జాతీయ ఆహార అత్యవసర పరిస్థితి ప్రకటించింది పాక్​​ ప్రభుత్వం.

ఈ పరిస్థితిని నివారించడానికి ఇప్పటికే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి కార్యచరణ రూపొందించుకుంది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. సంక్షోభాన్ని అధిగమించడానికి సుమారు రూ.730 కోట్లు అవసరమని అంచనా వేసింది.

Last Updated : Mar 1, 2020, 5:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.