ETV Bharat / international

చైనాలో 'లేకిమా' బీభత్సం-33కు చేరిన మృతులు

లేకిమా తుపానుతో తూర్పు చైనా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా 33 మంది మృతి చెందగా.. 16 మంది గల్లంతయ్యారు. సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

author img

By

Published : Aug 12, 2019, 6:50 AM IST

Updated : Sep 26, 2019, 5:31 PM IST

లేకిమా
లేకిమా తుపానుతో తూర్పు చైనా అతలాకుతలం

చైనాలో లేకిమా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. 187 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ప్రచండ గాలులతో తూర్పు చైనా వణికిపోతోంది. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారు. మరో 16 మంది గల్లంతయ్యారు.

జెజియాంగ్​ రాష్ట్రంలోని వెన్జౌ నగరంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లంతయింది. జెజియాంగ్, జియాంగ్సు రాష్ట్రాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వర్షాల కారణంగా షాంఘై డిస్నీల్యాండ్ మూతపడింది. జెజియాంగ్ రాష్ట్రంలో సుమారు 3,200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు రైళ్ల సర్వీసును నిలిపివేశారు.

1000 మందితో కూడిన విపత్తు నిర్వహణ బృందాలు సహా 150 అగ్నిమాపక యంత్రాలు, 153 పడవల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సుమారు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇదీ చూడండి: యెమెన్​లో తారస్థాయికి ఘర్షణలు.. 40 మంది మృతి

AP Video Delivery Log - 1800 GMT News
Sunday, 11 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1649: Guatemala Elections AP Clients Only 4224637
Guatemalans vote in close presidential runoff
AP-APTN-1631: Argentina Primaries AP Clients Only 4224629
Macri votes in closely-watched Argentina primaries
AP-APTN-1631: Sri Lanka Presidential Candidate AP Clients Only 4224635
Fmr Sri Lanka leader's brother to run for president
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 26, 2019, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.