హాంగ్‌కాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమ ముఖ్య నేత జోషువా వాంగ్ అరెస్టయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్ పార్టీ 'డెమోసిస్టో' ట్విట్టర్లో వెల్లడించింది.
హాంగ్‌కాంగ్‌లో గత మూడు నెలలుగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
శనివారం భారీ ర్యాలీ నిర్వహించాలని యువ నిరసనకారులు భావించారు. అందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా వాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హింసాత్మక ఘటనలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: బ్రెజిల్: అడవుల కాల్చివేతపై 60 రోజుల నిషేధం