ఒకటి కాదు... రెండు కాదు... 6 వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లతో కొలంబో సహా మరో రెండు నగరాలు దద్దరిల్లాయి. అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు.
ఊహించడానికి వీలుకాని ఉగ్రదాడిపై నిఘా సంస్థలు 10 రోజుల ముందే సమాచారమివ్వడం గమనార్హం. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
శ్రీలంక పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ఏప్రిల్ 11నే ఉన్నతాధికారులకు కొద్ది రోజుల్లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని సమాచారమిచ్చారు.
విదేశీ నిఘా సమాచారం...
ఓ విదేశీ నిఘా సంస్థ సైతం శ్రీలంకలోని పలు ప్రఖ్యాత చర్చిలపై ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించింది. ఎన్టీజే (నేషనల్ థోవీత్ జమాత్) ఈ దాడులకు ప్రయత్నిస్తుందని పేర్కొంది.
ఎవరీ ఎన్టీజే...
ఎన్టీజే గత సంవత్సరం శ్రీలంకలోని బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- ఇదీ చూడండి: శ్రీలంకలో ఉగ్రఘాతుకం- 160 మంది బలి