ETV Bharat / international

మరోమారు ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు! - క్షిపణి పరీక్ష

ఉత్తరకొరియా స్వల్ప లక్ష్యాల్ని ఛేదించగల క్షిపణుల్ని పరీక్షించిందని ప్రకటించింది దక్షిణ కొరియా. తమ సైన్యం ఈ విషయాన్ని నిర్ధరించిందని పేర్కొంది. అమెరికాతో అణు నిరాయుధీకరణ చర్చలు విఫలమైన అనంతరం ఉత్తరకొరియా ఈ చర్యకు ఉపక్రమించిందని తెలుస్తోంది.

'తాజాగా క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా'
author img

By

Published : May 4, 2019, 3:40 PM IST

Updated : May 4, 2019, 4:52 PM IST

'తాజాగా క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా'

అమెరికాతో అణు నిరాయుధీకరణ చర్చలు విఫలమైన అనంతరం ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. శనివారం తక్కువ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే క్షిపణుల్ని పరీక్షించడం తమ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా ప్రకటించింది.

"హోడో ప్రాంతంలోని తూర్పు తీర పట్టణం వాన్​సన్ నుంచి ఉత్తర కొరియా అధిక సంఖ్యలో స్వల్ప లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల్ని ప్రయోగించింది."

-దక్షిణ కొరియా

ఈ క్షిపణులు తూర్పు తీరం దిశగా, జపాన్​ వైపు 70 నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని దక్షిణ కొరియా వెల్లడించింది. 2017 నవంబర్​లో చివరిసారి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్ మధ్య వియత్నాం రాజధాని హనోయిలో జరిగిన రెండో దశ చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొరియా రెచ్చగొట్టే చర్యలకు దిగిందని తెలుస్తోంది. ఆంక్షలు సడలించాలంటే నిర్మాణాత్మకమైన అణు నిరాయుధీకరణ చేపట్టాలని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి కాంగ్ క్యుంగ్ సూచించిన మరుసటిరోజే ఈ చర్యలకు దిగింది కిమ్ సర్కార్.

అమెరికా స్పందన

ఉత్తరకొరియా పరీక్షపై అవసరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు శ్వేత సౌధం అధికార ప్రతినిధి సారా సాండర్స్.

"అమెరికాతో చర్చలు కొనసాగినప్పుడు ఏ పరీక్ష ఉత్తరకొరియా నిర్వహించలేదు. ఈ రాత్రి ఆ దేశ చర్యల గురించి తెలిసింది."
-శ్వేత సౌధ ప్రకటన

జపాన్ ప్రకటన

"బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించారని ఇంకా నిర్ధరణ కాలేదు. మా దేశ భద్రతకు సంబంధించి ఏ విధమైన విపత్కర పరిస్థితి నెలకొందని భావించడం లేదు "- జపాన్ ప్రకటన

ఇదీ చూడండి: ఫొని తుపానుపై ముందస్తు చర్యలు భేష్​: ఐరాస

Intro:Body:Conclusion:
Last Updated : May 4, 2019, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.