చక్రి రాజవంశానికి చెందిన 10వ చక్రవర్తి మహా వజీరలోంగ్కోర్న్ థాయ్‌లాండ్ సింహాసనాన్ని అధిష్టించారు. మిరుమిట్లు గొలిపే ప్రదర్శనల మధ్య హిందు, బౌద్ధ సంప్రదాయల్లో శనివారం అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. థాయ్ ప్రజలకు నీతిమంతమైన పాలన అందిస్తానని వాగ్దానం చేశారు రాజు.
మూడు రోజుల పట్టాభిషేక మహోత్సవంలో కీలక ఘట్టాన్ని చూసేందుకు రాజ భవనంలోకి ప్రజలను అనుమతించారు.
థాయ్‌లాండ్‌ను 1782 నుంచి చక్రి రాజవంశం పరిపాలిస్తోంది. రెండేళ్ల క్రితం తన తండ్రి మరణానంతరం వజీరలోంగ్కోర్న్ సింహాసనాన్ని అధిష్ఠించినా... పట్టాభిషేకం కోసం చాలా కాలంగా వేచి ఉన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ నదుల్లోని నీటిని తీసుకొచ్చి గ్రాండ్ ప్యాలస్ కాంప్లెక్స్‌లో మకిలి ఉత్సవం నిర్వహించారు. అనంతరం భారత్ నుంచి తీసుకొచ్చిన వజ్రం పొదిగిన 7.3 కిలోల బంగారు కిరీటాన్ని ధరించి సింహాసనంపై అధిష్ఠించారు.
రాణిగా నాలుగో భార్య
పట్టాభిషేకానికి కొన్ని రోజుల ముందే వివాహం చేసుకున్న నాలుగో భార్య సుతిదాను రాణిగా సింహాసనంపై కూర్చోబెట్టారు రాజు. అంతకుముందు తన భర్త ముందు మోకరిల్లి ఆశీర్వాదం తీసుకున్నారు సుతిద.
1950 తరువాత...
చాలా మంది థాయ్ ప్రజలకు పట్టాభిషేకం చూడటం ఇదే మొదటి సారి. గతంలో 1950లో వజీరలోంగ్కోర్న్ తండ్రి భుమిబోల్ అతుల్య తేజ్ పట్టాభిషిక్తుడయ్యారు. 2016 అక్టోబర్‌లో ఆయన మరణించారు.
ఇదీ చూడండి: ఫొని తుపానుపై ముందస్తు చర్యలు భేష్: ఐరాస