ETV Bharat / international

మన 'స్టైల్'​లో కరోనా పని పడదాం: కిమ్​ - vaccination in srilanka

కరోనాను ఎదుర్కోవడానికి తమకు టీకాలు అవసరం లేదన్న ఉత్తర కొరియా(Corona in North korea) ప్రభుత్వం.. వైరస్ కట్టడికి కీలక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 'మన స్టైల్​లో కరోనాను ఎదుర్కొందాం' అని అధికారులకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్​ ఉన్​(Kim jong-un) పిలుపునిచ్చారు. మరోవైపు.. దక్షిణ కొరియా, పాకిస్థాన్​లో కరోనా పంజా విసురుతోంది.

kim jong-un
కిమ్ జోంగ్ ఉన్​
author img

By

Published : Sep 3, 2021, 2:48 PM IST

"ఇప్పటివరకు మా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు." ఇదీ.. ఉత్తర కొరియా(Corona in North korea) ఇన్నాళ్లుగా చెబుతున్న మాట. అంతేగాకుండా ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్​ కోసం వెంపర్లాడుతుంటే.. కిమ్ జోంగ్​ ఉన్​ సర్కారు మాత్రం తమకు అక్కర్లేదంటూ ఐరాస పంపిణీ చేస్తామన్న వ్యాక్సిన్లను తిప్పి పంపింది. అయితే.. ఇప్పుడు వైరస్​ను ఎదుర్కోవడానికి ఆ దేశం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

"మన శైలిలో కరోనాను ఎదుర్కోవాలి" అని అధికారులకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim jong-un)​ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన పొలిట్​బ్యూరో సమావేశంలో ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలను ఏ ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం వహించకుండా వ్యవహరించాలని హెచ్చచరించారు.

ఐక్యరాజ్య సమితి(యూఎన్​)​ ఆధ్వర్యంలోని కొవాక్స్(covax)​ కార్యక్రమంలో భాగంగా యూనిసెఫ్​.. 29.7 లక్షల సినోవాక్​ టీకా డోసులను ఉత్తర కొరియాకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ వ్యాక్సిన్లు తమకు అవసరం లేదంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాటిని ఇతర దేశాలకు ఇవ్వాలని, భవిష్యత్తులో అవసరమైతే సంప్రదిస్తామంటూ ఆరోగ్య శాఖ పేర్కొందని యూనిసెఫ్​ వెల్లడించింది. అంతకుముందు.. ఉత్తరకొరియన్లు కరోనా నిబంధనలను తప్పక పాటించాలని కిమ్ తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులు మరికొన్నాళ్లపాటు మూసే ఉంటాయని చెప్పారు.

మరో నెలపాటు ఆంక్షలు..

మరోవైపు.. ఉత్తర కొరియా పొరుగుదేశమైన దక్షిణ కొరియాపై(Corona in south korea) కరోనా పంజా విసురుతోంది. ఆ దేశ రాజధాని సియోల్​లో కరోనా ఆంక్షలను మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు. ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ ఆంక్షలు ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నప్పటికీ.. ఆంక్షలను సడలిడం మరింత ప్రమాదకరం అని చెప్పారు. తాజా ఆంక్షల ప్రకారం సియోల్​లో సాయంత్రం 6 గంటల తర్వాత ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గంపులుగా ఉండరాదు.

న్యూజిలాండ్​లో ఉపశమనం..

కరోనా కేసులు స్వల్పంగా ఉన్నప్పటికీ.. కఠిన ఆంక్షల్లోకి వెళ్లిన న్యూజిలాండ్​లో(corona in new zealand) వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. రోజువారీ కొత్త కేసులు శుక్రవారం గణనీయంగా తగ్గాయని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆక్లాండ్​లో కరోనా డెల్టా వేరియంట్​ ఉద్ధృతికి అడ్డుకట్ట వేశామని భావిస్తున్నట్లు తెలిపారు.

కొత్తగా తమ దేశంలో 28 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. అంతకుముందు ఈ సంఖ్య 49గా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు.. ఆక్లాండ్​ నగరంలో కొన్ని ఆంక్షలు సడలించినప్పటికీ.. ఆ నగరం ఇంకా లాక్​డౌన్​లోనే(Lockdown in new zealnad) ఉంది. ఇప్పటికే.. ఆ దేశంలోని 48శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు అందింది.

పాక్​పై వైరస్​ పంజా..

పాకిస్థాన్​లో కరోనా విజృంభణ(covid in pakistan) కొనసాగుతోంది. ఆ దేశంలో కొత్తగా 3,787 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరణించినవారి సంఖ్య 26,035కు పెరిఖ్యతో కలిపి.. ఆ దేశంలో వైరస్ మరణాల రేటు 2.2శాతంగా ఉంది.

వారికీ ఇకపై వ్యాక్సిన్​...

శ్రీలంకలో డెల్టా వేరియంట్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో.. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వారికి టీకా పంపిణీని(vaccination in sri lanka) ఆ దేశం ప్రారంభించింది. తమ దేశంలో 20 నుంచి 30 ఏళ్ల వయుసు వారు 37 లక్షల మంది ఉన్నారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్​ నాటికి వారందరికీ టీకా పంపిణీని పూర్తి చేస్తామని పేర్కొంది. ఇప్పటికే 30 ఏళ్లు దాటిన వారికి టీకా రెండు డోసుల పంపిణీని ఆ దేశం పూర్తి చేసింది.

ఇవీ చూడండి:

C.1.2 virus: కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?

మరో కొత్త వేరియంట్‌.. వ్యాక్సిన్‌కు తలొగ్గని 'మ్యూ'!

కరోనా కొత్త వేరియంట్- అన్నింటికంటే డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.