ETV Bharat / international

కొరియాలో పెను విపత్తు- అధికారులపై కిమ్ బూతులు

author img

By

Published : Jun 30, 2021, 1:46 PM IST

ఉత్తర కొరియాలో కరోనా మహమ్మారి పెను విపత్తుగా మారింది. వైరస్​ను ఎదుర్కోవడంలో అక్కడి ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశాధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్ తీవ్రంగా నిందించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పరుష పదజాలంతో అధికార యంత్రాంగాన్ని దూషించినట్లు తెలిపింది. అయితే.. కిమ్​ అంతలా స్పందించడానికి పూర్తి కారణాలను వెల్లడించలేదు.

kim on fire
అధికారులపై కిమ్ బూతులు

ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అంతకంతకూ అసహనానికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. మహమ్మారి కట్టడి నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేసినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ పేర్కొంది. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్‌.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది.

సంక్షోభం ఏంటి?

అధికారుల నిర్లక్ష్యం దేశ, ప్రజల భద్రత విషయంలో పెను సంక్షోభానికి దారితీస్తోందని కిమ్‌ వ్యాఖ్యానించినట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. దేశంలో చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి పనులకు అధికారుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారిందని ఆయన అన్నట్లు పేర్కొంది. అయితే.. అసలు అక్కడ ఏం జరుగుతోంది? కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయా? కిమ్‌ పేర్కొంటున్న సంక్షోభం ఏంటి? అనే దానిపై మాత్రం కేసీఎన్‌ఏ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కునారిల్లుతున్న ఆరోగ్య వ్యవస్థలు..

తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఇటీవల కిమ్‌ డబ్ల్యూహెచ్‌ఓకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, దీనిపై అమెరికా, జపాన్‌ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మహమ్మారి కట్టడి కోసం ఉత్తర కొరియా కఠిన ఆంక్షలు విధించింది. బయట దేశాలతో పెద్దగా సంబంధాలు లేని ఆ దేశం.. ఉన్న అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతోనూ సరిహద్దులు మూసేసింది. దీంతో అక్కడ భారీ ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. మరోవైపు సంప్రదాయ వైద్య విధానాలపైనే ఆధారపడిన ఆ దేశ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలు మహమ్మారిని ఏమాత్రం ఎదుర్కోలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కిమ్‌ ఆది నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

కుంగుతున్న ఆర్థికానికి కరోనా దెబ్బ

కిమ్‌ పేర్కొన్న సంక్షోభం ఎలాంటిది అన్న దానిపై ఓ నిర్ధరణకు రావడం తొందరపాటు అవుతుందని ఆ దేశ వ్యవహారాలపై పట్టున్న దక్షిణ కొరియా నిపుణుడు చియోంగ్‌-సియోంగ్‌-చాంగ్‌ అన్నారు. అయితే, టెస్టింగ్‌ కిట్ల లేమి, వైద్య వసతుల కొరత వల్ల తొలి నుంచి ఉత్తర కొరియా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మహమ్మారి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని కిమ్‌ సర్కార్‌ భావిస్తున్నట్లుందని పేర్కొన్నారు.

టీకాల స్వీకరణకూ అనుమానాలు..

మరోవైపు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం కోసం ఏర్పాటైన కొవాక్స్‌ కూటమి ద్వారా ఉత్తర కొరియాకు ఇప్పటి వరకు ఒక్క డోసు కూడా చేరలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ వ్యాక్సిన్ల పంపిణీ వ్యవస్థ గవీ జూన్‌లో ప్రకటించింది. కొవాక్స్ కూటమి నిబంధనల ప్రకారం ఉత్తర కొరియాకు మే నాటికి 1.7 మిలియన్ డోసులు అందాల్సి ఉందని జపాన్‌ ప్రముఖ వార్తా సంస్థ క్యోడో న్యూస్‌ ఇటీవల పేర్కొంది. కానీ, కొవాక్స్‌ మార్గదర్శకాలు, నిబంధనలను అమలు చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా లేనందున టీకాలు వారికి చేరలేదని తెలిపింది. వ్యాక్సిన్లను తీసుకొచ్చే విదేశీయుల వల్ల కూడా దేశంలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉందని కిమ్‌ యంత్రాంగం భావిస్తున్నట్లు సమాచారం. పైగా వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల అక్కడి ఓ ప్రధాన వార్తా పత్రిక రోడోంగ్‌ సిన్‌మున్‌ కథనం ప్రచురించింది.

అందుకే సన్నబడ్డారా?

ఇక ఇటీవల కిమ్‌ బాగా సన్నబడ్డట్లు కేసీఎన్‌ఏలో ప్రచురితమైన ఓ కథనం ధ్రువీకరించింది. ఆయన సన్నబడడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా తెలిపింది. అయితే.. ఆయన ఇలా చిక్కిపోవడంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. అనారోగ్యం వల్లే ఆయన ఇలా అయి ఉంటారని కొంతమంది వాదిస్తుంటే.. కరోనా సోకి ఉంటుందని మరికొంత మంది అనుమానిస్తున్నారు. మరోవైపు దేశం తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొనకుండా.. వారి సానుభూతి కోసమే ఇలాంటి జిత్తులకు తెరతీస్తున్నారన్న వాదన కూడా ఉంది.

ఇదీ చూడండి: అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉత్తర కొరియా: కిమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.