ETV Bharat / international

జర్నలిస్ట్​ వైరల్ వీడియో వేలం- ధర ఎంతంటే? - కరాచీ సే లోగ్ వీడియో

పాకిస్థాన్​తో పాటు భారత నెటిజన్లను తెగ ఆకర్షించింది ఓ జర్నలిస్ట్ రిపోర్టింగ్ వీడియో. 'కరాచీ సే లోగ్​'(chand nawab video) పేరుతో ఉన్న ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వీడియో వేలానికి వచ్చింది.

chand nawab
ఛాంద్ నవాబ్
author img

By

Published : Aug 30, 2021, 5:17 PM IST

2008లో ఈద్​ సమయంలో పాకిస్థాన్​ కరాచీకి చెందిన ఓ రిపోర్టర్​ చేసిన వీడియో యూట్యూబ్​లో తెగ వైరల్​ అయ్యింది. అది ఎంత పాపులర్​ అయ్యిందంటే.. బాలీవుడ్​ హిట్​ చిత్రం 'భజరంగీ భాయ్​జాన్'లో దాన్ని పెట్టుకునేంత క్రేజ్​ను సొంతం చేసుకుంది. ఆ సినిమాతో ఈ వీడియోకు మరింత ఆదరణ లభించింది. 'కరాచీ సే లోగ్' పేరు(chand nawab video)తో ఉన్న ఈ వీడియోను నాన్ ఫంజిబుల్ టోకెన్(NFT) కింద 'ఫౌండేషన్​ యాప్'​లో వేలానికి పెట్టారు. వీడియో కనీస ధర రూ. 46 లక్షలుగా ఉన్నట్లు యాప్​ డిస్క్రిప్షన్​లో స్పష్టం చేశారు.

ఎందుకింత పాపులర్ అయింది?

కరాచీకి చెందిన టీవీ జర్నలిస్ట్ ఛాంద్​ నవాబ్(Chand Nawab Dialogue).. ఆయన చేసిన 'కరాచీ సే లోగ్​'(Karachi Viral video) రిపోర్టింగ్​ వీడియోతో బాగా పాపులర్ అయ్యారు. రైల్వే స్టేషన్​లో.. రిపోర్టింగ్​ చేస్తున్న సమయంలో కొందరు ఆయన్ని పట్టించుకోకుండా కెమెరా ముందు నుంచే వెలుతుంటారు. ఈ నేపథ్యంలో ఛాంద్ నవాబ్​ మాట్లాడిన విధానం నవ్వులు పూయిస్తుంది.

అయితే.. 2015లో విడుదలైన బాలీవుడ్ చిత్రం 'భజరంగీ భాయ్​జాన్'లో నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ(chand nawab bajrangi bhaijaan).. ఛాంద్​ నవాబ్​లా రిపోర్టింగ్​ చేయడం వల్ల.. 'కరాచీ సే లోగ్' వీడియో మరోసారి నెటిజన్లను ఆకర్షించింది. దీంతో ఛాంద్​ నవాబ్ మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఛాంద్​ నవాబ్ స్పందనేంటి?

ఫౌండేషన్ యాప్​ డిస్క్రిప్షన్​లో తాను ఎలా ఫేమస్​ అయ్యారో చెప్పుకొచ్చారు ఛాంద్​ నవాబ్. భారత్​, పాకిస్థాన్​లో పాపులర్ అయిన ఆయన వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయని తెలిపారు. దీన్ని వివిధ భాషల్లో అనువాదం కూడా చేశారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎవరైనా ఈ వీడియోను సొంతం చేసుకోవచ్చని.. అందుకే దీన్ని వేలానికి వేస్తున్నట్లు ఛాంద్​ నవాబ్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:కొడుకును చిత్రహింసలు పెట్టి.. సెల్ఫీ వీడియో తీసి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.