ETV Bharat / international

మరో నగరం తాలిబన్ల వశం- సంధికి సిద్ధమైన అఫ్గాన్‌! - తాలిబన్ల అక్రమణ

ఇప్పటికే అఫ్గానిస్థాన్​లో పలు ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్​ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు దేశంలో హింసను అదుపు చేసేందుకు తాలిబన్లతో అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధమైంది అఫ్గాన్​ ప్రభుత్వం. ఈ మేరకు తాలిబన్ల ముందు ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

taliban
తాలిబన్లు
author img

By

Published : Aug 13, 2021, 5:25 AM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మరోవైపు దేశంలో హింసను అదుపులోకి తెచ్చేందుకు అఫ్గాన్‌ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తాలిబన్లతో అధికారం పంచుకునే ఒప్పందానికి సిద్ధమైంది. ఈ మేరకు ఖతార్‌లోని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు తాలిబన్ల ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌కు ఈ ప్రతిపాదన ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అఫ్గానిస్థాన్‌లోని ఇప్పటికే కీలక ప్రాంతాలు తాలిబన్ల వశమైన నేపథ్యంలో కాబూల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అఫ్గానిస్థాన్‌ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు దూకుడు పెంచారు. ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించేశారు. గురువారం.. రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా తాలిబన్లు వశపరుచుకున్నారు. కాబూల్‌-కాందహార్‌ జాతీయ రహదారిపై ఉన్న ఈ కీలక నగరాన్ని తాలిబన్లు ఆక్రమించిన విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం ధ్రువీకరించింది. ఇప్పటికే అఫ్గాన్‌ ప్రభుత్వం ఉత్తర, పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని చాలా ప్రాంతాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

ఇదీ చూడండి: ఆగని తాలిబన్ల దురాక్రమణ- భారత్ ఇచ్చిన చాపర్ సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.