కాబుల్ విమానాశ్రయం వద్ద గత నెల జరిగిన ఆత్మహుతి దాడిపై(kabul airport bomb blast).. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన భారత విభాగం "వలియత్ హింద్" సంచలన వివరాలు బయటపెట్టింది. ఆత్మహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ఐదేళ్ల ముందు దిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్టు వెల్లడించింది. 'కశ్మీర్' కోసం భారీ ప్రతికార దాడులకు ప్రణాళికలు రచిస్తుండగా అతడు పోలీసులకు చిక్కాడని.. ఆ తర్వాత అధికారులు అతడిని అఫ్గాన్ సైన్యానికి అప్పజెప్పారని.. తన మేగజైన్ "సావత్ అల్- హింద్"లో రాసుకొచ్చింది.
ఆగస్టులో.. తాలిబన్ల ఆక్రమణతో అఫ్గాన్ సంక్షోభం ముదిరింది. దేశాన్ని వీడేందుకు ప్రజలు భారీ సంఖ్యలో కాబుల్ విమానాశ్రయానికి తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఆగస్టు 26న అదును చూసుకుని.. అబ్బే గేట్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడింది ఐసిస్-కే(ఖొరసన్)(isis khorasan). ఈ ఘటనలో 250మందికిపైగా మరణించారు. వీరిలో 13మంది అమెరికా సైనికులు, తాలిబన్ ఫైటర్లు కూడా ఉన్నారు.
ఇదీ చూడండి:- ISIS khorasan: 'ఐసిస్-కే'కు రూ.వేల కోట్ల నిధులు ఎలా వచ్చాయ్?
మేగజైన్ కథనం ప్రకారం...
అఫ్గాన్‌లోని లగోర్ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల అబ్దుల్ రహ్మాన్ అల్-లగోరి.. ఆత్మహుతి దాడికి(kabul airport blast) పాల్పడ్డాడు. అతడు 25ఏళ్ల వయస్సులో భారత్‌కు వచ్చాడు. ఇంజినీరింగ్ కోసం దిల్లీ-ఫరిదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో పేరు నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి.. రహ్మాన్ భారత్‌కు వచ్చింది.. కశ్మీర్ విషయంలో భారత్‌పై ప్రతికారం తీర్చుకోవడం కోసమే. దిల్లీకి వచ్చిన కొద్ది రోజులకే వేట మొదలుపెట్టాడు రహ్మాన్. రద్దీ ప్రాంతాలను జల్లెడ పట్టి.. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాడు. ఆత్మహుతి దాడి కోసం ప్రణాళికలు రచించాడు.
రహ్మాన్‌ను పట్టుకునేందుకు 'రా' రంగంలోకి దిగింది. 18నెలల పాటు అతడిపై నిఘా పెట్టింది. ఓ 'వ్యక్తి'ని బరిలోకి దింపి.. రహ్మాన్‌తో దగ్గరయ్యేలా చేసింది. ఆ వ్యక్తిపై నమ్మకంతో రహ్మన్.. దిల్లీలోని లజ్‌పత్ నగర్లో ఓ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకున్నాడు. అక్కడే 2017 సెప్టెంబర్‌లో పోలీసులు రహ్మాన్‌ను పట్టుకున్నారు.
ఆ తర్వాత రహ్మాన్‌ను అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైన్యం తన కస్టడీలోకి తీసుకుంది. 2021 ఆగస్టులో అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశ జైళ్లల్లో ఉన్న నేరస్థులు, ఉగ్రవాదులను తాలిబన్లు ఒక్కసారిగా విడిచిపెట్టారు. అలా బయటకొచ్చిన రహ్మాన్.. వెంటనే తన 'సోదరుల'తో కలిసి ఐఎసిస్-కే ప్రాబల్యమున్న ప్రాంతానికి వెళ్లాడు(isis khorasan province). అక్కడే కాబుల్ ఆత్మహుతి దాడి కోసం తన పేరు నమోదు చేసుకున్నాడు.(kabul airport attack)
ఇదీ చూడండి:- ISIS Kabul Attack: ఏంటీ ఐసిస్-కే? తాలిబన్లకు శత్రువా?
ఐసిస్-కేలో భారతీయులు!
కశ్మీర్‌పై ఎక్కువ దృష్టి సారించే ఐసిస్-కే.. భారత్ నుంచే ఎక్కువ నియామకాలు చేసుకుంటుంది. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో వారిని తీసుకుని ఫైటర్లుగా మారుస్తుంది.(isis kerala connection)
2020 మార్చి 25న, కాబుల్‌లోని ధరమ్శాలా గురుద్వారాలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 28మంది మరణించారు. కశ్మీర్లో ముస్లింల అణచివేతకు ప్రతికారంగా దాడి చేసినట్టు ఐసిస్-కే ప్రకటించింది. ఆ దాడికి పాల్పడింది కేరళకు చెందిన సాజిద్. 2015 మార్చిలో ముంబయి నుంచి దుబాయ్ వెళ్లిన సాజిద్.. ఇస్లామిక్ స్టేట్‌తో కలిసిపోయాడు.
-- సంజీవ్ కే బారువా, సీనియర్ జర్నలిస్ట్.
ఇదీ చూడండి:- ISIS Kabul Attack: 'ఐసిస్-కే'లో 14 మంది కేరళవాసులు- తాలిబన్ల దయతో...