జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా(japanese pm news) విదేశాంగ శాఖ మాజీ మంత్రి.. ఫుమియో కిషిడాను(fumio kishida political views) ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది. ప్రధానిగా సోమవారం రాజీనామా చేసిన.. యొషిహిదే సుగా స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.
కిషిడా, ఆయన మంత్రివర్గం సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ తెలిపింది.
గత వారమే.. సుగా నుంచి లిబర్ డెమొక్రాటిక్ పార్టీ(Liberal Democratic Party) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు కిషిడా. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కరోనా మహమ్మారిని కట్టడి చేయటం, ఇతర దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు సహా.. కొద్ది వారాల్లోనే రాబోతున్న ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటం ఆయన ముందున్న సవాళ్లు.
సుగా రాజీనామా చేసిన క్రమంలో.. ప్రధాని పదవికి ప్రస్తుతం వ్యాక్సినేషన్ మంత్రిగా పనిచేస్తున్న టారో కోనో పోటీపడ్డారు. అయితే.. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో కిషిడానే విజయం వరించింది.
ఇదీ చూడండి: Japan PM Yoshihide Suga: బాధ్యతల నుంచి తప్పుకోనున్న జపాన్ ప్రధాని!