ETV Bharat / international

తుపాను​ ధాటికి జపాన్ విలవిల​- 11 మంది బలి​ - 11 killed and 10 injured in Japan

'హగీబిస్'​తుపాను​ ధాటికి జపాన్​ విలవిలలాడుతోంది. వరదల కారణంగా 11 మంది మరణించగా.. 10 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 100 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

తుపాను​ ధాటికి జపాన్ విలవిల​- 11 మంది బలి​
author img

By

Published : Oct 13, 2019, 10:43 AM IST

Updated : Oct 13, 2019, 1:33 PM IST

జపాన్​లో 'హగీబిస్'​ తుపాను బీభత్సం

జపాన్​లో 'హగీబిస్'​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఈ తుపాను ధాటికి 11 మంది మృతి చెందగా.. 10 మందికి పైగా గల్లంతయ్యారు. మరో 100 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో అతి ఘోరమైన తుపాను ఇదేనని పేర్కొన్నారు.

హగీబిస్​..

ఈ తుపానుకు 'హగీబిస్' అని నామకరణం చేశారు. హగీబిస్​ అనగా ఫిలిప్పీన్స్​​లో 'వేగం' అని అర్థం. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. వరదల వలన జపాన్​లోని పలు నదులు ఉప్పొంగుతున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుంటం వల్ల నదీ పరివాహక ప్రాంతంలోని పలు ఇళ్లు కుప్పకూలాయి.

రైళ్ల రాకపోకలకు అంతరాయం...

తుపాను హెచ్చరికల నేపథ్యంలో పలు రైళ్లు నిలిపివేశారు. పట్టాలపై నీళ్లు భారీగా చేరాయి.

రగ్బీ ఆట..

తుపాను కారణంగా ఉత్తర జపాన్‌లోని కమైషిలో నమీబియా, కెనడా మధ్య జరగాల్సిన ప్రపంచ రగ్బీ కప్ మ్యాచ్​ను అధికారులు రద్దు చేశారు.

17000 మంది సిబ్బంది...

జపాన్​ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 17 వేల మంది పోలీసులను, సైనిక దళాలను వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించింది. దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

అంధకారంలో పలు ఇళ్లు..

తుపాను హెచ్చిరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా టోక్యో ఎలక్ట్రికల్​ డిపార్టుమెంట్​ విద్యుత్తు సేవలను నిలిపి వేసింది. 3,70,000 పైగా ఇళ్లు అంధకారంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

1958 మాదిరిగా...

హగీబిస్​... 1958లో వచ్చిన తుపాను​లాగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ ఘటనలో 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 50 లక్షల ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఇదీ చూడండి:మృత్యు వైరస్​ 'నిఫా' మళ్లీ వస్తుందా...?

New Delhi, Oct 13 (ANI): After their impressive camaraderie in the hit film 'Sonu ke Titu Ki Sweety,' Kartik Aaryan and Sunny Singh have reunited for the upcoming movie 'Pati Patni Aur Woh.' Sharing the news with his fans, Kartik uploaded a picture with his co-star on Instagram from the sets of the film and wrote, "Sonu ke Titu aa rahe hain #ChintuTyagi se milne.. #PatiPatniAurWoh mein @mesunnysingh Tera yaar hoon main." The duo who played childhood friends in 'Sonu Ke Titu ki Sweety' witness a rollercoaster journey in their life which ultimately ends with their friendship winning at the end against a girl named Sweety who tries really hard to break their bond. The film 'Pati Patni Aur Woh' which also stars Ananya Panday and Bhumi Pednekar is being directed by Mudassar Aziz, who has previously helmed films like 'Dulha Mil Gaya', 'Happy Bhag Jayegi' and 'Happy Phirr Bhag Jayegi'. The film is an adaptation of the 1978 drama of the same name, which featured Sanjeev Kumar, Vidya Sinha and Ranjeeta Kaur in the lead roles. The original one revolved around a married couple Ranjeet (Sanjeev) and Sharda (Vidya) and how things change after he gets involved with his secretary Nirmala (Ranjeeta). The upcoming film is slated to release on December 6, this year.
Last Updated : Oct 13, 2019, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.