ETV Bharat / international

ఆ దేశాల్లో మళ్లీ కరోనా భయం.. వేగంగా ఆస్పత్రుల నిర్మాణం.. త్వరలో లాక్​డౌన్​! - singapore booster shot

పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థ, సరిపడినన్ని కొవిడ్ పడకలు ఉన్నప్పటికీ జపాన్ విశ్రమించట్లేదు. ఏ క్షణంలోనైనా కరోనా(japan corona cases) ప్రమాదకరంగా మారొచ్చని భావించిన ప్రభుత్వం కొవిడ్ ఆసుపత్రులను వేగంగా సిద్ధం చేస్తోంది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాక్షిక లాక్​డౌన్ విధించే యోచనలో ఉంది నెదర్లాండ్స్ ప్రభుత్వం. ఇక.. కరోనా కేసులు కనిష్ఠ స్థాయికి చేరినప్పటికీ.. పర్యటకం ప్రధాన దేశమైన థాయ్​లాండ్..​ వినోద రంగాన్ని ఇప్పట్లో ప్రారంభించేది లేదని తేల్చిచెప్పింది. కరోనా ముప్పు నేపథ్యంలో దశలవారీగా ఆ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది.

FES36-VIRUS-DENMARK
కరోనా
author img

By

Published : Nov 12, 2021, 7:15 PM IST

కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్న వార్తలతో జపాన్ ప్రభుత్వం(japan government) అప్రమత్తమైంది. వేలాది ఆసుపత్రి పడకలను శరవేగంగా సిద్ధం చేస్తోంది.

జపాన్‌లో ఆరోగ్య బీమా వ్యవస్థ పటిష్ఠంగానే ఉంది. అంతేగాక ఇతర దేశాలతో పోలిస్తే అధిక సంఖ్యలో ఆసుపత్రి పడకలు చెప్పుకోదగ్గ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐదో వంతు పడకలు మాత్రమే గతంలో కరోనా రోగుల కోసం(japan covid hospitalisation rate) వినియోగించినప్పటికీ.. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. కొవిడ్ రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులకు రాయితీలనూ అందిస్తోంది.

  • శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో.. నవంబర్ చివరి నాటికి కరోనా చికిత్స కోసం మరిన్ని ఆసుపత్రులు, పడకలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపుతో 28వేల నుంచి 37వేల మంది కొవిడ్ రోగులకు చికిత్స అందించచ్చు.
  • దేశంలోని పలు ఆసుపత్రులు.. సిబ్బంది కొరత, అధిక ఖర్చులను సాకుగా చూపిస్తూ కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ముందుకు రావడం లేదు. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లోనూ సంసిద్ధంగా ఉండేందుకే ఆసుపత్రుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
  • జపాన్​లో ఆగస్టులో రోజువారీ కేసులు 25వేలు వెలుగుచూశాయి. దీనితో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. చాలా మంది రోగులకు ఆసుపత్రుల్లో పడకలు లభించక.. ఇళ్ల వద్దే ఆక్సిజన్ ఆధారిత చికిత్సను అందించారు. కొందరు ఇంటి వద్దే మరణించిన సంఘటనలూ నమోదయ్యాయి.

"రాబోయే చెడు కాలాన్ని(కరోనా విజృంభణను) అంచనా వేయడం, అంటువ్యాధుల విస్తరణను అడ్డుకునేందుకు సిద్ధం కావడం ముఖ్యం" అని ప్రధాని(japan prime minister) కిషిడా(fumio kishida) వ్యాఖ్యానించారు. టీకా రెండు డోసులు తీసుకుని ఎనిమిది నెలలు పూర్తయిన వారికి వచ్చే నెల నుంచి 'బూస్టర్ డోసు'(japan booster shots) అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

జర్మనీలో బహిరంగ కార్యక్రమాలు రద్దు!

జర్మనీలో కరోనా(germany corona cases) విజృంభిస్తున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా బహిరంగ కార్యక్రమాలను రద్దు(germany covid lockdown) లేదా వాయిదా వేసుకోవాలని జర్మనీ వ్యాధి నియంత్రణ కేంద్రం సూచించింది. అక్కడ వైరస్ వ్యాప్తి(germany covid situation) రేటు గత ఏడు రోజుల్లో ప్రతి లక్ష మందిలో 263.7కు పెరిగింది. ఇది గతంలో ఇది 249.1గా ఉంది.

దేశంలో గురువారం కొత్త కరోనా(germany corona news) కేసులు 50వేల దిగువకు చేరాయి. అక్కడ కొత్తగా 48,640 మందికి వైరస్ సోకగా.. మరో 191 మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో ఇప్పటివరకు 97,389 మంది మహమ్మారికి బలయ్యారు.

డిజిటల్ పాస్ తప్పనిసరి..

డెన్మార్క్​లో కరోనా కేసులు(denmark corona cases) పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి 'ప్రమాదకర వ్యాధి'గా ప్రకటించింది ప్రభుత్వం(denmark government). దీనితో శుక్రవారం నుంచి 'డిజిటల్ పాస్‌'(corona pass app) పద్ధతిని ప్రవేశపెట్టింది. నైట్‌క్లబ్‌లు, కేఫ్‌లు, పార్టీలు, రెస్టారెంట్లు, బస్సులు, ఇండోర్ ప్రదేశాల్లోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా పాస్‌ను చూపించాలని ఆదేశించింది. ఈ విధానం ఓ నెలపాటు అమల్లో ఉండనుంది.

జులై 1న 'పాస్' విధానాన్ని ప్రవేశపెట్టింది డెన్మార్క్ ప్రభుత్వం. వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉండటం, వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉందన్న కారణంతో సెప్టెంబర్ 10న తొలగించింది. అయితే దేశం​లో ఊహించిన దాని కంటే వేగంగా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

ఏమిటీ పాస్..?

  • 'డెన్మార్క్ కరోనా పాస్ యాప్'లో(corona pass app).. ఓ వ్యక్తి టీకా రెండు డోసులు తీసుకున్న సమాచారం ఉంటుంది.
  • రెండు వారాల క్రితం మొదటి డోస్ తీసుకున్న సమాచారం తెలుస్తుంది.
  • ఇటీవల కరోనా బారినుంచి కోలుకున్న సమాచారంతో పాటు..
  • గడచిన 72 గంటల్లో కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్ట్ వస్తే గ్రీన్ కలర్​ 'క్యూఆర్ కోడ్‌'ను చూపిస్తుంది.

డెన్మార్క్​లో(denmark corona cases today) 12 ఏళ్లు పైబడిన వారిలో 87.6 శాతం మందికి టీకా(denmark covid vaccination rate) తొలి డోసు అందించారు. 86 శాతం జనాభాకు రెండో డోసు పూర్తయింది.

థాయ్​ వినోదాలు ఇప్పట్లో లేనట్లే..

థాయ్​లాండ్ వ్యాప్తంగా కరోనా కేసులు(thailand covid 19 cases) తగ్గుముఖం పట్టినప్పటికీ.. దేశంలోని వినోద రంగాన్ని తెరిచేందుకు ఇప్పట్లో అనుమతులు జారీచేయలేమని ప్రభుత్వం(thailand government) తెలిపింది. జనవరి 15 వరకు వేచిచూడనున్నట్లు ప్రకటించింది. వినోద రంగ పునరుద్ధరణ అనుమతులపై పరిశ్రమ వర్గాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయితే దేశంలో కరోనా ముప్పు కొనసాగుతోందని.. పబ్‌లు, బార్లలో గాలి నాణ్యత.. నివారణ చర్యలు సమర్థంగా లేవని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని ప్రాంతాలను నిశితంగా పరిశీలించిన అనంతరం అనుమతుల జారీ ప్రక్రియను ఆరంభిస్తామని హామీ ఇచ్చింది.

  • నవంబర్ నుంచే టీకా రెండు డోసులు తీసుకున్న సందర్శకులకు అనుమతులిస్తోంది థాయ్​లాండ్. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యటక రంగం 20 శాతం వాటాను కలిగి ఉంది.
  • థాయ్​లాండ్​లో శుక్రవారం 7,305మందికి వైరస్(thailand covid cases) నిర్ధరణ కాగా.. 51 మరణాలు నమోదయ్యాయి. దేశ జనాభాలో 65 శాతం మందికి టీకా పంపిణీ పూర్తయింది.

నెదర్లాండ్స్​లో లాక్​డౌన్​?

ఇటీవలి వారాల్లో ఐరోపా(europe covid cases) అంతటా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నెదర్లాండ్స్​లోనూ కరోనా కేసులు(netherlands corona cases) పెరుగుతున్న నేపథ్యంలో పాక్షిక లాక్‌డౌన్‌ను(netherlands lockdown news) విధించాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం(netherlands government). 'రాబోయే మూడు వారాల పాటు.. రాత్రి 7 గంటల తర్వాత బార్‌లు, రెస్టారెంట్లతో పాటు జనసమ్మర్ధ ప్రాంతాల మూసివేత, క్రీడా మైదానాల్లో అభిమానుల నిషేధం వంటి ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు' పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు. అయితే ఈ వార్తలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • ఒకవేళ ఆంక్షలు(netherlands covid rules) విధిస్తే.. వచ్చేవారం జరగాల్సిన సాకర్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్​కు అభిమానులను అనుమతించరు.
  • దీనితో లాక్‌డౌన్‌ వార్తలపై డచ్ సాకర్(netherlands soccer matches) సమాఖ్య అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫుట్​బాల్ స్టేడియాల్లో కొవిడ్​ మహమ్మారికి వ్యతిరేకంగా కఠిన విధానాలు అవలంబిస్తున్నామని.. ఇవి కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం కాదంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
  • లాక్​డౌన్ విధింపు అనేది ప్రభుత్వ విధానపర లోపంగా ఇతర సంస్థలు అభివర్ణించాయి.
  • బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సంఘం సైతం లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించింది.

టీకా గరిష్ఠ కాల పరిమితిపై సమీక్ష

ఓ వ్యక్తి కరోనా టీకా(singapore vaccine rate) రెండు డోసులు తీసుకున్న అనంతరం 365+14 రోజులపాటే సురక్షితమని సూచించే నిబంధనను సమీక్షించనున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ(ministry of health, singapore) ప్రకటించింది. ఆయా టీకాల కాలపరిమితి చెల్లుబాటును సవరించనున్నట్లు తెలిపింది.

బూస్టర్ డోస్‌ల(singapore booster shot) పంపిణీ ద్వారా రక్షణ మరింత మెరుగవుతుందా? లేదా? అనే సమాచారాన్ని నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ విశ్లేషణ ఆధారంగా సిఫార్సులు ఉండనున్నట్లు 'ఛానెల్ న్యూస్ ఆసియా' ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.