ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ ప్రాంతంపై రాకెట్లతో దాడి జరిగింది. అమెరికా సహా విదేశీ రాయబార కార్యాలయాలుండే గ్రీన్ జోన్ ప్రాంతంపై రెండు రాకెట్లను ప్రయోగించినట్లు ఇరాక్ సైన్యం తెలిపింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.
ఇరాక్‌లోని అమెరికా బలగాల స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన 24 గంటల తర్వాత.. ఈ ఘటన జరగడం ఉద్రిక్త వాతావరణాన్ని పెంచుతోంది. తమ సైన్యం ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ వెనక్కి తగ్గాలని హెచ్చరించారు.