ఇరాన్ వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. సైబర్ దాడులు జరగడం వల్లే సాంకేతిక సమస్య తలేత్తి ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. పెట్రోల్ కోసం వచ్చి టెహ్రాన్‌లో బంకుల ముందు వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరిన దృశ్యాలు ప్రసారం చేసింది.
అయితే సేవలు నిలిచిపోవడానికి కారణమేంటనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చమురు శాఖ అత్యవసరంగా సమావేశమైంది.
ఇదీ చదవండి: భయపెడుతున్న ఏవై.4.2 వేరియంట్- శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?