ETV Bharat / international

బైడెన్​ను కాపాడిన ఆ అఫ్గాన్​ వ్యక్తి సేఫ్! - South Asia News

అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్న తనను కాపాడాలని ఇటీవల అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థించిన అమన్​ ఖలిలీ.. సురక్షితంగా దేశం నుంచి బయటపడ్డాడు. అమెరికా ప్రభుత్వం, అఫ్గాన్​ మాజీ సైనిక సిబ్బంది సాయంతో.. కుటుంబసమేతంగా పాక్​ చేరుకున్నాడు. బైడెన్​ సెనేటర్​గా ఉన్న సమయంలో.. ఓసారి అఫ్గాన్​ పర్యటనలో మంచు తుపాను సంభవించగా.. క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్​ బృందాన్ని కాపాడింది ఖలిలీనే.

Interpreter Who Rescued Biden In 2008 Escapes Afghanistan With Help Of US Soldiers
బైడెన్​ను కాపాడిన ఆ అఫ్గాన్​ వ్యక్తి సేఫ్​
author img

By

Published : Oct 12, 2021, 6:10 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ను గతంలో కాపాడిన అఫ్గానిస్థాన్​కు చెందిన వ్యక్తి.. సురక్షితంగా ఆ దేశం నుంచి బయటపడ్డాడు. అమెరికా ప్రభుత్వం, సైన్యం సాయంతో.. తన కుటుంబంతో సహా పాకిస్థాన్​ చేరుకున్నాడు అమన్​ ఖలిలీ. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే.. అతడు ఉన్న ప్రాంతం గురించి రహస్యంగా ఉంచడమే మంచిదని అభిప్రాయపడింది.

తమ సేన‌ల‌కు సాయం చేసిన వారికి ప్ర‌త్యేకంగా యూఎస్ స్పెష‌ల్ ఇమ్మిగ్రెంట్ వీసాల‌ను జారీ చేస్తుంది అమెరికా. అయితే ఈ వీసా పొంద‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన ఖ‌లిలీ.. త‌న‌కు సాయం చేయాల‌ని అమెరికాను కోరాడు. అప్పుడు సానుకూలంగా స్పందించిన బైడెన్​ సర్కార్​.. అతడిని రక్షిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ జరిగింది..

బైడెన్(biden news)​.. 2008లో సెనేటర్​గా ఉన్న రోజుల్లో ఓసారి అఫ్గాన్​ పర్యటనకు వెళ్లారు. ప్రతికూల పర్యటనల కారణంగా ఆయన హెలికాప్టర్​ను మారుమూల గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. క్లిష్టపరిస్థితుల్లో బైడెన్​ బృందాన్ని అన్వేషించడం భద్రతా దళాలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ దుబాసి అమన్​ ఖలిలీ.. భద్రతా దళాలకు సాయం చేశాడు. అలా బైడెన్​ బృందాన్ని రక్షించగలిగాడు.

అయితే.. అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ప్రాణభయంతో తనను, తన కుటుంబాన్ని కాపాడాలని అమెరికాను అభ్యర్థించాడు. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఎట్టకేలకు ఇప్పుడు అతడికి రక్షణ లభించినట్లయింది.

ఇదీ చూడండి: US drone strike: అమెరికా చివరి దాడి గురి తప్పిందిలా!

కూతురి వైద్యం కోసం మరో బిడ్డను అమ్మేసిన తల్లి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.