కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు ప్రజలందరూ ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కువగా సామాజిక మాధ్యమాలలోనే గడుపుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లపై సమయం వెచ్చిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరికొత్త ఛాలెంజ్ వచ్చింది.
'హ్యాండ్ జెస్ట్చర్ ఛాలెంజ్' పేరుతో ఓ సరికొత్త గేమ్ వైరల్ అవుతోంది. దీన్నే 'జెస్ట్చర్ ఛాలెంజ్' అని కూడా అంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఎలా ఆడాలి?
ఈ ఛాలెంజ్‌లో తెరపై ఓ వరుస క్రమంలో చేతి ఎమోజీలు కనిపిస్తాయి. అక్కడ చూపిన విధంగా ఆ గుర్తులను మనం చేసి చూపించాలి. దీన్నే 'ఎమోజీ హ్యాండ్ ఛాలెంజ్' అని పిలుస్తారు. చూడటానికి ఎంతో సులభంగా ఉన్నా ఇందులో తప్పులు చేస్తూనే ఉంటారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ గేమ్‌ను నెటిజన్లు విపరీతంగా ఆడుతున్నారు.
- View this post on Instagram
Be Happy ,Be Bright, Be You 🦄☺️ #gesturechallenge#tiktok#quarantine#duetwithme
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇంతకీ ఈ ఛాలెంజ్ ఎలా చేయాలంటే
ఈ ఛాలెంజ్ కోసం ఇలా చేయాలి..
- ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్/ఎక్స్ప్లోర్ పేజ్ ఓపెన్ చేసి 'i.m.noel'ను సెర్చ్ చేసి ఈ ఇన్‌స్టా ఖాతాను ఓపెన్ చేయాలి.
- ఆ ఖాతాలో ఫేస్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
- జెస్ట్చర్ ఛాలెంజ్ వీడియోను ఓపెన్ చేయాలి.
- కుడివైపు కింద 'సేవ్ టూ కెమెరా' అనే బటన్‌ను మీ ఫిల్టర్ లైబ్రరీలో జోడించాలి.
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ జెస్చర్ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా!
ఇదీ చదవండి: ట్విట్టర్లో మోదీ త్రీడీ యోగా క్లాసులు