చెట్లు నరికి కాంక్రీట్ వనాన్ని పెంచుతున్నారు మనుషులు. ఈ చర్యల వల్ల పర్యావరణానికి పెనుముప్పు పొంచి వుంది. ఈ విషయమే ఇండోనేసియాకు చెందిన మేడీ బాస్తోనికి తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ విషయంపై వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.
అంతరించి పోతున్న అడవుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు దాదాపు 700 కిలోమీటర్ల పాటు వెనక్కి నడిచేందుకు నిర్ణయించుకున్నాడు. తన స్వగ్రామం తూర్పు జావా నుంచి దేశ రాజధాని జకార్తా వరకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. ఒక అద్దాన్ని వీపుకు తగిలించుకుని దాని సహాయంతో వెనక్కు నడుస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాడు. ఒక్కోసారి ఎంతో అలసట అనిపిస్తుందని.. అయినా భవిష్యత్తు తరాలకోసం ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.
-
This Indonesian man is walking backwards 700 km from his hometown to the captital to protect forests and raise awareness about deforestation pic.twitter.com/cV8s6xUk1g
— TRT World (@trtworld) August 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This Indonesian man is walking backwards 700 km from his hometown to the captital to protect forests and raise awareness about deforestation pic.twitter.com/cV8s6xUk1g
— TRT World (@trtworld) August 13, 2019This Indonesian man is walking backwards 700 km from his hometown to the captital to protect forests and raise awareness about deforestation pic.twitter.com/cV8s6xUk1g
— TRT World (@trtworld) August 13, 2019
జులై 18న తన నివాసం నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు బాస్తోని. ఆగస్టు 17 నాటికి రాజధాని జకార్తాకు చేరుకునేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. అయితే కాలినొప్పి కారణంగా చేరుకోలేకపోయాడు.
700 కి.మీ లక్ష్యాన్ని పూర్తి చేసి దేశాధ్యక్షుడిని కలవాలనుకుంటున్నాడు. అడవులకు జరుగుతున్న నష్టాన్ని.. తద్వారా మానవ జీవనానికి జరిగే ముప్పును ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాడు.