Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మలుకు రాష్ట్రంలోని నైరుతి ప్రాంతంలో గురువారం.. భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రత నమోదైనట్లు ఆ దేశానికి చెందిన బందన్ వాతావరణ, భౌగోళిక ఏజెన్సీ(బీఎంకేజీ) ప్రకటించింది. అయితే సునామీ హెచ్చరికలేవీ జారీ చేయలేదన్నారు.
భూప్రకంపనల ధాటికి రెండు ఇళ్లు కుప్పకూలాయి. ఇంకొన్ని ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
మలుకులోని తియకుర్ నగరానికి 132 కిలోమీటర్లు దూరంలో అర్ధరాత్రి 1.25 సమయంలో సముద్రంలో భూమి కంపించినట్లు తెలిపారు. సముద్రగర్భంలో 183 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే సునామీకి ఎలాంటి ఆస్కారం లేదని పేర్కొన్నారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: ఒమిక్రాన్‌తో కరోనా కేసుల సునామీ: డబ్ల్యూహెచ్ఓ