జపాన్ తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా బుధవారం స్వదేశానికి రప్పిస్తామని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. నౌకలో మొత్తం 3,711మంది ఉండగా.. అందులో భారతీయులు 138 మంది. అయితే 16 మంది భారతీయులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యవంతులను మాత్రమే స్వదేశానికి రప్పించేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
జపాన్ తీరంలో ఉన్న నౌక నుంచి కొవిడ్-19 లేనివారిని ఆ దేశంలో దించారు. అయితే ఇప్పటికీ 1000 మంది నౌకలోనే ఉన్నారు.
ఇదీ చూడండి: పొగాకు అభిమానులకు అరుదైన చుట్టల ప్రదర్శన.!