ETV Bharat / international

భారత యుద్ధనౌకకు ఇంధనం నింపిన అమెరికా నేవీ - Logistics‌ Memorandum of Understanding on Transfer

అరేబియా సముద్రంలో ఐఎన్​ఎస్​ తల్వార్‌ యుద్ధనౌక.. అమెరికా నేవీకి చెందిన యూకోన్‌ ట్యాంకర్‌ నుంచి ఇంధనం నింపుకొన్నట్లు భారత నావికా దళం వెల్లడించింది. రక్షణ రంగంలో సహకారం పెంపొందించుకునేలా 2016లో భారత్-అమెరికా మధ్య లాజిస్టిక్స్‌ బదిలీపై కుదిరిన అవగాహన ఒప్పందం(ఎల్​ఈఎంఓఏ) కింద ఇంధనం నింపుకొన్నట్లు తెలుస్తోంది.

Indian warship undertakes refuelling with US Navy tanker in Arabian Sea
భారత యుద్ధనౌకకు ఇంధనం నింపిన అమెరికా నేవీ
author img

By

Published : Sep 15, 2020, 8:15 AM IST

Updated : Sep 15, 2020, 8:50 AM IST

రక్షణ రంగ ఒప్పందంలో భాగంగా అరేబియా సముద్రంలో అమెరికా నావికా దళానికి చెందిన ట్యాంకర్ యూకోన్‌ నుంచి భారత యుద్ధనౌక ఇంధనాన్ని నింపుకొంది. లాజిస్టిక్స్ బదిలీపై కుదిరిన అవగాహన ఒప్పందం కింద ఐఎన్​ఎస్​ తల్వార్‌ యుద్ధనౌక... యూకోన్‌ ట్యాంకర్‌ నుంచి ఇంధనం నింపుకొన్నట్లు భారత నేవీ వెల్లడించింది. సైనిక విధుల కోసం ఉత్తర అరేబియా సముద్రంలో... ఐఎన్​ఎస్​ తల్వార్‌ను మోహరించినట్లు తెలిపింది.

రక్షణ రంగంలో సహకారం పెంపొందించుకునేలా 2016లో భారత్-అమెరికా మధ్య లాజిస్టిక్స్‌ బదిలీపై అవగాహన ఒప్పందం(ఎల్​ఈఎంఓఏ) కుదిరింది. భారత్‌కు.. ఫ్రాన్స్‌, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలతోనూ ఈ తరహా ఒప్పందాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: శుక్రుడి మేఘాల్లో సూక్ష్మజీవులు?

Last Updated : Sep 15, 2020, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.