ETV Bharat / international

తీరుమారని పాక్​కు భారత సైన్యం దీటైన జవాబు - Pak violates ceasefire

కరోనా వేళ పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి పాక్​ సైన్యం మరోమారు కాల్పులకు తెగించింది. శత్రు దేశం కవ్వింపు చర్యలకు భారత్​ దీటుగా సమాధానమిచ్చినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లక్షితదాడులు జరిపి పాక్​ సైన్యానికి గట్టిగా బుద్ధి చెప్పినట్లు ప్రకటించారు.

Indian Army inflicts heavy damage on 'enemy side' after Pak violates ceasefire
లక్షితదాడి
author img

By

Published : Apr 10, 2020, 10:33 PM IST

కరోనా సంక్షోభ సమయంలోనూ భారత్​తో కయ్యానికి కాలు దువ్వుతోంది పాకిస్థాన్. ఒకవైపు మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న వైరస్​ను అరికట్టేందుకు ప్రపంచం ప్రయత్నిస్తుంటే.. పాక్​ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. శుక్రవారం జమ్ముకశ్మీర్​ కుప్వాడా జిల్లా కేరన్​ సెక్టార్​లో పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్​కు గట్టి బుద్ధి చెప్పింది భారత సైన్యం.

పొరుగు దేశంలోని సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులు చేసింది. అయితే ఈ దాడుల కారణంగా పాక్​ సైన్యానికి భారీ నష్టం జరిగిందని వెల్లడించారు సైనికాధికారులు.

"కుప్వాడా జిల్లా కేరన్ సెక్టార్లో పాక్​ కాల్పులను భారత సైన్యం సమర్థమంతంగా ఎదుర్కొంది. ప్రతీకారం తీర్చుకుంది. శత్రువుల వైపు భారీ నష్టం వాటిల్లినట్లు మా వద్ద సమాచారం ఉంది.

- భారత రక్షణ ప్రతినిధి

ఈ వారంలో పూంచ్ జిల్లాలోని నియంత్రణరేఖ వెంట చిన్న ఆయుధాలు, మోర్టార్ షెల్స్‌తో పాక్​ సైన్యం దాడులకు తెగబడింది. గత వారంలో సుందర్బని-నౌషేరా సెక్టార్లో పాక్​ సైన్యం జరిపిన దాడుల కారణంగా ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 23 వరకు కాల్పుల విరమణను పాకిస్థాన్ కనీసం 646సార్లు ఉల్లంఘించినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ మార్చిలో పార్లమెంట్​కు తెలిపారు. 2019లో 3,200 సార్లకు పైగా కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.