కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరానికి వందేభారత్ మిషన్‌లో భాగంగా విమానాన్ని భారత్ పంపనుంది. అక్కడ తిరిగి సాధారణ జీవనం ప్రారంభమైన తరువాత తొలిసారిగా ఈ నెల 30న ఎయిరిండియా సంస్థ దిల్లీ నుంచి వుహాన్‌కు విమానాన్ని నడపనుంది. ఈ విషయాన్ని బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఈ నెల 23న దిల్లీ నుంచి గ్వాంజావ్కి వెళ్లాల్సిన విమానం రద్దవటంతో తాజా తేదీని ప్రకటించింది. అదనపు సమాచారం కోసం ప్రయాణికులు కార్యాలయ వెబ్‌సైట్‌ని సంప్రదించాలని ప్రకటనలో పేర్కొంది. వందేభారత్ మిషన్ కింద చైనాకు భారత్ పంపనున్న ఆరో విమానమిది.
ఇదీ చూడండి: రెండేళ్లలో భారత్‌కు నూతన పార్లమెంటు భవనం!