ETV Bharat / international

'ఇండో పసిఫిక్​ తీరప్రాంత భద్రతే లక్ష్యం' - ఇండో పసిఫిక్​ తీర ప్రాంతం

ఇండో- ఫసిఫిక్ తీరప్రాంత భద్రతే లక్ష్యంగా భారత్, శ్రీలంక, మాల్దీవులు త్రైపాక్షిక భేటీ నిర్వహించాయి. భారత్​ తరఫున ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత తదితర అంశాలపై చర్చించారు.

India, Lanka and Maldives agree to bolster maritime security cooperation
ఇండో- ఫసిఫిక్ తీరప్రాంత భద్రతే లక్ష్యం
author img

By

Published : Nov 28, 2020, 8:46 PM IST

ఇండో- పసిఫిక్ తీరప్రాంత భద్రతలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగుతామని భారత్, శ్రీలంక, మాల్దీవులు ప్రకటించాయి.

శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన త్రైపాక్షిక సమావేశంలో ఈ మేరకు మూడు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ పాల్గొన్నారు. ఆరేళ్ల విరామం తర్వాత నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌ నుంచి డోభాల్, శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి మేజర్‌ జనరల్‌ కమల్‌ గుణరత్నే, మాల్దీవులు రక్షణ మంత్రి మారియా దీదీ హాజరయ్యారు.

India, Lanka and Maldives agree to bolster maritime security cooperation
సమావేశంలో పాల్గొన్న అజిత్​ డోభాల్

సంయుక్త ప్రకటనను విడుదల చేస్తున్న ప్రతినిధులు

భారత్, శ్రీలంక, మాల్దీవులు త్రైపాక్షిక భేటీ

ఈ త్రైపాక్షిక భేటీలో ఇండో-పసిఫిక్‌ తీర ప్రాంత భద్రతకు అనుసరించాల్సిన ఉమ్మడి భాగస్వామ్యం, వ్యూహాలపై చర్చించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రించటం, సముద్ర కాలుష్యం, తీర ప్రాంతాల భద్రతకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవటంపై చర్చ జరిగింది. ఇటీవల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: గురునానక్ జయంతి ఉత్సవాలకు 600 మంది సిక్కులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.