నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌తో పాకిస్థాన్‌లో భారత దౌత్య వ్యవహారాల ఇన్‌ఛార్జి గౌరవ్ అహ్లువాలియా ర్వాల్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు దౌత్యవేత్తలతో సమావేశానికి పాకిస్థాన్ అనుమతించింది.
అంతకుముందు జాదవ్‌తో భారత అధికారుల భేటీకి అనుమతిస్తూ పాక్ చేసిన ప్రకటనను స్వాగతించిన భారత్... స్వేచ్ఛాపూర్వక సమావేశానికి దాయాది అవకాశం కల్పిస్తుందని ఆకాంక్షించింది.
"అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అనుసరించి... స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో కుల్‌భూషణ్‌తో సమావేశమయ్యేలా పాకిస్థాన్ అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నాం."
-భారత అధికారులు
ఇరాన్లో వ్యాపారం నిర్వహిస్తుండగా 2016లో పాక్ ఏజెంట్లు కుల్‌భూషణ్‌ను అపహరించారు. ఆ తర్వాత పాక్‌లోకి ప్రవేశిస్తుండగా బలూచిస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. గూఢచర్యం, పాక్ వ్యతిరేక ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నెపంతో 2017లో పాకిస్థానీ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. శిక్షపై స్టే విధించాలని... తదుపరి కార్యాచరణ చేప్టటాలని కోరుతూ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్. మరణశిక్ష నిర్ణయంపై పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను కోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ