ETV Bharat / international

చైనా వీసా ఆంక్షలపై భారత సీఈఓల ఆందోళన

author img

By

Published : Apr 3, 2021, 8:01 PM IST

చైనాలో ప్రయాణ, వీసా ఆంక్షల వల్ల తమ కార్యకలాపాలకు ఆటంకం ఎదురవుతోందని అక్కడి భారతీయ వ్యాపారవేత్తలు పేర్కొన్నారు. ఈ మేరకు చైనాలోని భారత రాయబారికి తమ సమస్యలను వివరించారు. ఈ విషయంపై చైనా ప్రభుత్వంతో చర్చిస్తామని భారత రాయబారి హామీ ఇచ్చారు.

VIRUS CHINA INDIA RESTRICTIONS
చైనా వీసా ఆంక్షలపై భారత సీఈఓల ఆందోళన

చైనాలో ఇప్పటికీ కొనసాగుతున్న ప్రయాణ, వీసాపరమైన ఆంక్షలపై అక్కడి భారతీయ వ్యాపారవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటి వల్ల తమ కార్యకలాపాలకు ఆటంకం ఎదురవుతోందని అన్నారు. చైనాకు భారత రాయబారిగా ఉన్న విక్రమ్ మిస్త్రీతో జరిగిన సమావేశంలో మాట్లాడిన పలు సంస్థల సీఈఓలు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

VIRUS CHINA INDIA RESTRICTIONS
సమావేశంలో మాట్లాడుతున్న మిస్త్రీ

షాంఘై పర్యటనలో ఉన్న మిస్త్రీ.. శుక్రవారం అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్​కు చెందిన పలు సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. ఎనిమిది కీలక రంగాలకు చెందిన 30 మంది ప్రతినిధులతో మాట్లాడారు.

VIRUS CHINA INDIA RESTRICTIONS
భారత సంస్థల సీఈఓలు, ప్రతినిధులు

ఈ ఆంక్షలపై వారంతా తమ సమస్యలను వెల్లడించగా.. వాటిపై చైనా ప్రభుత్వంతో చర్చిస్తామని మిస్త్రీ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత ఎంబసీ ఇందుకోసం నిర్విరామంగా కృషి చేస్తుందని మిస్త్రీ చెప్పినట్లు పేర్కొన్నాయి.

టీకా తీసుకుంటేనే!

గతేడాది నవంబర్​లో చైనా ప్రభుత్వం భారతీయుల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడవడం లేదు. భారత్ సహా 19 దేశాల ప్రజలు.. చైనా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే తమ దేశంలోకి అనుమతిస్తామని ఆ దేశం గతనెలలో ప్రకటించింది. చైనా టీకాలు భారత్​లో అందుబాటులో లేకపోవడం సమస్యాత్మకంగా మారింది.

ఇదీ చదవండి: కరోనా బీభత్సం- ఆ దేశాల్లో మళ్లీ లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.