ETV Bharat / international

India China border: సరిహద్దుల్లో 60 వేల మంది చైనా సైనికులు!

India China Border: భారత్​ సరిహద్దుల్లో 60 వేల మంది చైనా సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరింపు సహా సరిహద్దుల్లో జోరుగా మౌలిక వసతులు మెరుగుపరుస్తోంది. కాగా చైనాకు​ దీటుగా భారత్ చర్యలు చేపడుతోంది. భారత్​ కూడా భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నట్లు సమాచారం.

India China border
India China border
author img

By

Published : Jan 4, 2022, 5:01 AM IST

Updated : Jan 4, 2022, 5:23 AM IST

India China Border: భారత్​-చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​ శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుంటే.. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. వివాదస్పద ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తోంది. నిత్యం 60 వేల మంది చైనా సైనికులు పహారా కాస్తున్నాయి.

"వేసవి శిక్షణ కోసం భారత​ సరిహద్దుల్లో చైనా భారీగా తమ బలగాలను మోహరించింది. ఫలితంగా వారి సంఖ్య పెరిగింది. వారు ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికీ సరిహద్దుల్లోని వివాదస్పద ప్రాంతాల్లో 60 వేల మంది సైనికులు ఉన్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరోవైపు అత్యవసర సమయంలో బలగాలు, ఆయుధ సామాగ్రిని సరిహద్దులకు తరలించేందుకు సరిహద్దు వెంబడి యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు మెరుగుపరుస్తోంది చైనా. పాంగాంగ్​ సరస్సుపై వంతెన నిర్మిస్తోంది.

చైనాకు దీటుగా భారత్​..

సరిహద్దుల్లో చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నట్లు పేర్కొన్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా మౌలిక వసతులను మెరుగుపరుస్తోందని వెల్లడించాయి.

ఇదీ చూడండి: టర్కీలో ధరల భగభగ.. తిండి కూడా కొనుక్కోలేని దుస్థితి!

Last Updated : Jan 4, 2022, 5:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.