ETV Bharat / international

పాక్​లో జరిగిన ఎస్​సీఓ సమావేశానికి భారత్ హాజరు​ - ఒకే వేదికపై భారత్​ పాక్​

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత పాకిస్థాన్​లో జరిగిన ఓ సమావేశానికి భారత్​ తొలిసారి హాజరైంది. షాంఘై సహకార సంఘం(ఎస్​సీఓ).. రక్షణ, భద్రత నిపుణుల 9వ సమావేశం ఈ నెల 19, 20 తేదీల్లో ఇస్లామాబాద్​లో జరిగింది.

India Attends Two-Day SCO Defence and Experts Meet in Pakistan
పాక్​లో జరిగిన ఎస్​సీఓ సమావేశానికి హాజరైన భారత్​
author img

By

Published : Feb 21, 2020, 5:25 AM IST

Updated : Mar 2, 2020, 12:50 AM IST

పాకిస్థాన్​ రాజధాని ఇస్లామాబాద్​లో రెండు రోజుల పాటు జరిగిన షాంఘై సహకార సంఘం (ఎస్​సీఓ) సమావేశం ముగిసింది. ఎస్​సీఓ రక్షణ, భద్రత నిపుణుల 9వ సమావేశం ఈ నెల 19, 20 తేదీల్లో జరిగింది. భారత్​ సహా ఇతర సభ్యదేశాలు పాల్గొన్నాయి.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత భారత్​-పాక్​ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలహీనమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్​లో జరిగిన సమావేశానికి భారత్​ హాజరవ్వడం ఇదే తొలిసారి.

చర్చలు..

ఈ సమావేశంలో సభ్య దేశాలన్నీ ప్రాంతీయ భద్రత సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం.. ఇంటర్​ సర్వీస్​ పబ్లిక్​ రిలేషన్స్ (ఐఎస్​పీఆర్​) తెలిపింది. సైనికులకు ఉమ్మడి శిక్షణ, కసరత్తుపై సభ్యదేశాలు కీలక సమాచారం, అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొంది.

సభ్యదేశాలు..

ఎస్​సీఓలో భారత్​ సహా రష్యా, చైనా, పాకిస్థాన్​, కజికిస్థాన్​, కిర్జిస్థాన్​, తజికిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​, బెలారస్​లు సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఎస్​సీఓ ముఖ్యనేతల వార్షిక సమావేశానికి ఈ ఏడాది చివర్లో భారత్​ తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశంలో పాకిస్థాన్​ నుంచి ఎవరు పాల్గొంటారనే విషయం ఆసక్తిగా మారింది.

ఇదీ చూడండి:'ట్రంప్​ అందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు'

Last Updated : Mar 2, 2020, 12:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.