ETV Bharat / international

భారతీయులంతా వెనక్కి రావాలి- కేంద్రం హెచ్చరిక! - Taliban resurgence

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మారణహోమం సృష్టిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ పౌరులంతా వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాలని హెచ్చరించింది. అక్కడ ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు కూడా తమ సిబ్బందిని భారత్​కు తీసుకురావాలని సూచించింది.

India evacuating staff from consulate in Mazar-e-Sharif
భారతీయులందరూ వెనక్కి రావాలని కేంద్రం హెచ్చరిక
author img

By

Published : Aug 10, 2021, 5:49 PM IST

అఫ్గానిస్థాన్​లోని భారతీయులంతా వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వీరిని భారత్​కు తీసుకువచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయాలని అఫ్గాన్​లోని భారత రాయబార కార్యాలయానికి సూచించింది. అక్కడ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న భారత సంస్థలు కూడా తమ సిబ్బందిని తక్షణమే భారత్​కు తీసుకురావాలని తెలిపింది.

అఫ్గాన్​లో తాలిబన్లకు, సైన్యానికి భీకర యుద్ధం జరుగుతోంది. ఈ మారణహోమంలో భారీ సంఖ్యలో జనం మరణిస్తున్నారు. దీంతో అప్రమత్తమై భారత ప్రభుత్వం తమ ప్రజలు స్వదేశానికి తిరిగిరావాలని హెచ్చరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.