ETV Bharat / international

పాక్ రాజధానిలో తొలి హిందూ గుడికి పునాది

పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​లో తొలిసారి హిందూ ఆల‌యాన్ని నిర్మించ‌నున్నారు. 10కోట్ల పాకిస్థానీ రూపాయల ఖ‌ర్చుతో ఆల‌య నిర్మాణం చేపట్టనున్నారు. ఇస్లామాబాద్‌లోని హెచ్‌-9 సెక్టార్​లో 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో 'శ్రీ కృష్ణ మందిర్' నిర్మాణానికి బుధవారం శంకుస్థాప‌న చేశారు.

Pak capital to get Hindu temple
హిందూ ఆలయానికి శంకుస్థాపన
author img

By

Published : Jun 24, 2020, 4:42 PM IST

పాకిస్థాన్​ రాజధాని ఇస్లామాబాద్​లో నివసిస్తున్న హిందువుల చిరకాల వాంఛ నెరవేరుతోంది. రాజధాని నగరంలో హిందూ ఆలయానికి పునాది పడింది. ఆలయంతో పాటు హిందూ శ్మశాన వాటికను పాకిస్థాన్​ నిర్మిస్తోంది. ఇస్లామాబాద్​లో ఇదే తొలి ఆలయంగా నిలవనుంది.

ఇస్లామాబాద్​లోని హెచ్​-9 సెక్టార్​ ప్రాంతంలో 20వేల చదరపు అడుగుల్లో నిర్మించనున్న ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. పాక్ మానవ హక్కుల విభాగం పార్లమెంటరీ కార్యదర్శి లాల్​ చంద్​ మాల్హీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆలయానికి 'శ్రీకృష్ణ మందిర్​'గా నామకరణం చేసింది ఇస్లామాబాద్ హిందూ పంచాయత్​.

Pak capital to get Hindu temple
శంకుస్థాపనలో పాల్గొన్న పాక్ నేతలు

"రెండు దశాబ్దాలుగా నగరంలో హిందువుల జనాభా పెరుగుతోంది. తమకు ఆలయం కావాలని చాలా కాలంగా హిందూ సమాజం కోరుతోంది. అంతేకాకుండా హిందువులకు శ్మశానవాటిక కూడా లేదు. ఆలయ సమీపంలోనే దీని నిర్మాణమూ జరుగుతుంది."

- లాల్​ చంద్​ మాల్హీ

ఇస్లామాబాద్‌లో 1947కు ముందు క‌ట్టిన అనేక హిందూ ఆల‌యాలు ఉన్నట్లు మాల్హీ తెలిపారు. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడం వల్ల వాడ‌కంలో లేవని చెప్పారు.

2017లోనే కేటాయించినా..

జాతీయ మానవ హక్కుల కమిషన్​ ఆదేశాల మేరకు 2017లో హిందూ పంచాయత్​కు 'రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ' (సీడీఏ) ఈ భూమిని కేటాయించింది. అయితే అధికారిక ప్రక్రియ పూర్తయ్యే సరికి కొంత ఆలస్యం జరిగింది.

ప్రభుత్వ ఖర్చుతోనే..

ఆలయానికి సంబంధించి పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల శాఖ మంత్రి పీర్​ నూర్​ ఉల్​ హక్ ఖాద్రీ స్పష్టం చేశారు. సుమారు ఇందుకు 10 కోట్ల పాకిస్థానీ రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. మందిర నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేక గ్రాంటు కేటాయించాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ను కోరినట్లు వెల్లడించారు.

భారత్​లో ముస్లింలకు మసీదు ద్వారాలు మోదీ ప్రభుత్వం మూసేస్తోందని పాక్​ విమర్శలు చేస్తోంది. బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందూ ఆలయం నిర్మిస్తోందని వ్యాఖ్యానిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆలయ నిర్మాణానికి ఇమ్రాన్​ ప్రభుత్వం ఆమోదించింది.

ఇదీ చూడండి: 'కరోనా వినాశక విఘ్నేశుడు సిద్ధం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.