గిల్గిత్-బాల్టిస్థాన్‌లో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి చెందిన నేత ఖలీద్ ఖుర్షీద్ సోమవారం ఎన్నికయ్యారు. ఇప్పటికే స్పీకర్ పదవిని ఈ పార్టీ నేత అంజద్ అలీ చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం 23 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా... ఇమ్రాన్ పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని చేపట్టింది.
స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 3, పాకిస్థాన్ ముస్లిమ్స్ లీగ్ నవాజ్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం ఫజిల్, మజ్లిస్ వాహదత్-ఇ-ముస్లిమీన్ పార్టీలు చెరో స్థానం సాధించాయి.
ఇదీ చూడండి: 30 మంది తాలిబన్లను మట్టుబెట్టిన అఫ్గాన్ సైన్యం!