ETV Bharat / international

భారత్ లక్ష్యంగా పాక్ ప్రధాని అభ్యంతరకర వ్యాఖ్యలు!

భారత్​పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్. భారత్​ వైపు నుంచి ఏదైనా చర్యకు దిగితే పాక్ సైన్యం తీవ్రంగా స్పందిస్తుందని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు

author img

By

Published : Feb 7, 2020, 5:56 AM IST

Updated : Feb 29, 2020, 11:49 AM IST

Imran Khan
ఇమ్రాన్​ఖాన్

భారత్​ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్​. భారత్​ ఏదైనా చర్యకు పాల్పడితే పాక్​ సైన్యం తీవ్రంగా స్పందిస్తుందని ప్రగల్భాలు పలికారు.

"నరేంద్రమోదీ, భారత ఆర్మీ చీఫ్​... మీ ఇద్దరికీ ఓ సందేశం ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఆగస్టు​ 5న(ఆర్టికల్-370 రద్దును ప్రస్తావిస్తూ) పొరపాటు చేశారు. హిందూ ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి మీరు పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చనే తప్పుడు అభిప్రాయంలో ఉంటే... అదే మీ చివరి పొరపాటు అవుతుంది. 20 కోట్ల మంది పాకిస్థాన్ ప్రజలు, యుద్ధానుభవం ఉన్న మా సైన్యం భారత్​కు గట్టి గుణపాఠం చెబుతుంది."-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి

కశ్మీర్ సమస్యను పూర్తిగా అంతం చేస్తానని మోదీ భావించారని.. కానీ అది ఇప్పుడు అంతర్జాతీయ అంశంగా మారిందని తెలిపారు ఇమ్రాన్. కశ్మీర్​ ప్రజలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటామని వ్యాఖ్యానించారు. వారికోసం పోరాడుతూనే ఉంటామన్నారు. అదే సమయంలో పాక్​ మిలటరీ కూడా ఇమ్రాన్ వ్యాఖ్యలకు వత్తాసు పలికింది. భారత సైన్యం దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటామని పేర్కొంది.

మరోవైపు కశ్మీర్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి ఆయిషా ఫరూఖీ. కశ్మీర్ సమస్య పాక్ విదేశాంగ విధానంలో అత్యంత ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు.

మోదీ వ్యాఖ్యలకు బదులుగానే!

గత నెలలో జరిగిన ఎన్​సీసీ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. యుద్ధం జరిగితే పాక్​ను మట్టికరిపించడానికి భారత సైన్యానికి రెండు రోజులకు మించి సమయం పట్టదని వ్యాఖ్యానించారు. వీటిని ఉద్దేశించే ఇమ్రాన్​ తాజా వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

Intro:Body:

dd

Conclusion:
Last Updated : Feb 29, 2020, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.