ETV Bharat / international

రోగుల పాలిట సంజీవని.. కేరాఫ్​ '5జీ ఆసుపత్రి'

చైనాకు చెందిన దిగ్గజ టెలికాం సంస్థ హువావే.. ఆసుపత్రులతో జతకట్టి ఆరోగ్య సేవలను అందిస్తోంది. 5జీ సాంకేతికతను ఉపయోగించుకుని 5జీ అంబులెన్స్​ను రూపొందించారు ఆసుపత్రి సిబ్బంది. ఇందులో సకల సదుపాయాలు ఉంటాయి. రోగిని అంబులెన్స్​లో ఎక్కించుకుని అవసరమైన పరీక్షలు చేసేందుకు వీలుంటుంది. 5జీ నెట్​వర్క్​తో ఆ పరీక్షల ఫలితాలు వెంటనే ఆసుపత్రిలోని వైద్యులకు చేరుతాయి. రోగి ఆసుపత్రికి చేరకముందే.. అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేస్తారు. ఇలా అరగంటకుపైగా సమయం ఆదా అవుతోందని, రోగుల జీవితాలను రక్షించేందుకు అది ఎంతో కీలకమని వైద్యులు చెబుతున్నారు.

huawei china news
రోగుల పాలిట సంజీవని కేరాఫ్​ '5జీ ఆసుపత్రి'
author img

By

Published : Nov 7, 2021, 10:03 AM IST

రోగుల పాలిట సంజీవని.. కేరాఫ్​ '5జీ ఆసుపత్రి'

ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు చివరి క్షణాలు అత్యంత కీలకం. సకాలంలో అంబులెన్స్​లో ప్రాథమిక చికిత్స అందినా, రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అంబులెన్స్​లో అందించిన చికిత్సతో కొద్దిసేపు ఆ ప్రాణాలు మినుకుమినుకుమన్నా.. ఆసుపత్రిలో కొంత ఆలస్యమైతే ఇక ఆ రోగి బతకడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు హృదయవిదారకం. మరి అంబులెన్స్​లో ఉన్నప్పుడే ఆ రోగి ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేస్తే? సమయం ఆదా అవడం వల్ల రోగి ప్రాణాలు నిలుస్తాయి. మరి ఇది నిజంగా జరుగుతుందా? అంత కచ్చితత్వంతో, అంత వేగంగా సమాచార పంపిణీ సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.​ చైనాలోని ఓ ఆసుపత్రి ఈ పనిని చేసి చూపించింది. ఇందుకు '5జీ సాంకేతికత' సంజీవనిగా మారింది.

ప్రపంచమంతా ఇప్పుడు 5జీ సాంకేతికతవైపు అడుగులు వేస్తోంది. చైనాలోని గ్యాంగ్జౌ రాష్ట్రానికి చెందిన ఓ ఆసుపత్రి.. ఈ సాంకేతికతను అందిపుచ్చుకుని 5జీ అంబులెన్స్​తో రోగుల ప్రాణాలను రక్షిస్తోంది. ఈ అంబులెన్స్​లోని వైద్య పరికరాలు, కెమెరాలకు 5జీ సాంకేతికతను అనుసంధానించారు. దీంతో ఆసుపత్రిలోని వైద్యులు అంబులెన్స్​లో పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించవచ్చు. రోగి అంబులెన్స్​లోకి ఎక్కిన వెంటనే.. సిబ్బంది ఓవైపు ప్రాథమిక చికిత్స అందిస్తూనే మరోవైపు సంబంధిత పరీక్షలు చేసి సమస్యను కనుగొనేందుకు త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశముంటుంది. ఈ పరీక్షల్లో రోగికి గుండెపోటు వచ్చినట్టు తేలితే, ఆసుపత్రిలో వైద్యులు తక్షణమే అప్రమత్తమై.. చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు.

"ఉదాహరణకు.. ఛాతి నొప్పి వచ్చిన రోగిని అంబులెన్స్​లో ఎక్కించుకున్నారు అనుకుందాం. ఆ రోగికి అక్కడే ఎలక్ట్రోకార్డియోగ్రఫి పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష ఫలితాలను ఆసుపత్రికి వెంటనే చేరవేస్తారు. అందులో ఎక్యూట్​ మయోకార్డియో ఇన్ఫార్​క్షన్​ అని తేలితే.. వెంటనే ఆసుపత్రిలో కాథెటెరైజేషన్​ ల్యాబొరేటరీని సిద్ధం చేస్తారు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. రోగి ఆసుపత్రికి చేరుకున్న వెంటనే, ఎమర్జెన్సీ విభాగం, సీసీయూ కాకుండా తక్షణమే కాథెటెరైజేషన్​ ల్యాబ్​కు తీసుకెళ్లవచ్చు. దీంతో రోగి ప్రాణాలు రక్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి."

--- లియూ జింగ్​టియో, గ్యాంగ్​డాన్​ జనరల్​ హాస్పిటల్​ చీఫ్​ ఫిజీషియన్​.

ఆసుపత్రి వైద్యులు ఈ 5జీ అంబులెన్స్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రోగి ఆసుపత్రికి చేరకముందే, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆపరేషన్​ థియేటర్​కు సిద్ధం చేసేంత వరకు పని చాలా సులభం అవుతోందని, అరగంట సమయం ఆదా అవుతోందని అంటున్నారు. ఆ అరగంట సమయం రోగి ప్రాణాలు నిలిపేందుకు కీలకం అని అభిప్రాయపడుతున్నారు.

ఒక్క అంబులెన్స్​నే కాకుండా.. మొత్తం ఆసుపత్రినే 5జీ సాంకేతికతతో అనుసంధానించారు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుల వరకు అన్ని 5జీ సాంకేతికతతోనే ముడిపడ్డాయి. అంతేకాకుండా.. రోగులకు స్మార్ట్​వాచ్, బ్యాండ్​​ను అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆ వాచ్​ ఉపయోగపడుతుంది. బ్యాండ్​ ధరించిన రోగికి సహాయం కావాలన్నా, ఆరోగ్య పరిస్థితి విషమించినా.. నర్సుకు వెంటనే సమాచారం అందుతుంది. సకాలంలో రోగికి తగిన చికిత్స అందించేందుకు వీలవుతుంది. వీటితో పాటు ఔషధాలు అందించేందుకు, ఆసుపత్రి గదులను శుభ్రం చేసేందుకు రోబోలను కూడా వాడుతున్నారు.

అతి తక్కువ సమయంలో, అత్యంత వేగంగా ఇన్ని కార్యకలాపాలు సాగుతున్నాయంటే.. అందుకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'స్మార్ట్​ బ్రెయిన్​' కారణం. స్మార్ట్​ బ్రెయిన్​ అనేది 5జీ నెట్​వర్క్​కు చెందిన క్లౌడ్​ కంప్యూటింగ్​ సెంటర్​. ఆసుపత్రికి అనుసంధానించిన 12వేలకుపైగా 5జీ పరికరాల నుంచి వచ్చే సమాచారాన్ని ఇది ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. అంతేకాకుండా.. అంబులెన్స్​కు స్థానికంగా ట్రాఫిక్​ వివరాలు అందించి ఆసుపత్రికి వేగంగా చేరుకునేందుకు దోహదపడుతుంది.

చైనాకు చెందిన దిగ్గజ టెలికాం సంస్థ హువావే.. ఈ 5జీ సాంకేతికతను అందిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆరోగ్యసంరక్షణతో పాటు మరిన్ని రంగాల్లో ఈ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది హువావే. ఈ విధంగా.. అమెరికా ఆంక్షలతో దెబ్బతిన్న సంస్థ ఆర్థికాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది.

ఇదీ చూడండి:- చైనా దూకుడు- 3 రిమోట్​ సెన్సింగ్​ శాటిలైట్లు ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.