హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తార స్థాయికి చేరాయి. నిరసనకారులకు మద్దతుగా రెండు వారాల పాటు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు విద్యార్థులు. సెంట్రల్ హాంకాంగ్‌లో వేలాది మంది ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలిపారు. ఫలితంగా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలకాలని రాజకీయ నేతలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
నేరస్థులను చైనాకు అప్పగించే ఒప్పందం సహా హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు విద్యార్థులు వెన్నెముకగా ఉన్నారు.
ఆందోళనల్లో పాల్గొంటున్న వందలాది నిరసనకారులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ చైనా అధికార పత్రికల్లో పలు సంపాదకీయాలు ప్రచురించాయి. హాంకాంగ్ అనిశ్చితులకు ముగింపు వస్తుందంటూ హెచ్చరికలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఆందోళనలు మరింత తీవ్రం చేశారు.
ఇదీ చూడండి: పడవలో చెలరేగిన మంటలు... 33 మంది గల్లంతు!