ETV Bharat / international

వార్తా పత్రికలు కొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం - Hongkong news

హాంకాంగ్​ మీడియా దిగ్గజం జిమ్మీ లై అరెస్ట్​కు నిరసనగా.. ఆయనకు చెందిన యాపిల్​ డైలీ వార్తాపత్రికను పెద్దఎత్తున కొనుగోలుచేసి మద్దతు ప్రకటించారు అక్కడి ప్రజలు. ఇందుకోసం ఉదయాన్నే వార్తాపత్రికల దుకాణాల వద్ద బారులు తీరారు.

Hong Kong residents buy newspaper to support free press
హాంకాంగ్​లో వార్త పత్రికలు కొనడానికి బారులు తీరిన జనం
author img

By

Published : Aug 11, 2020, 3:48 PM IST

జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన హాంకాంగ్​ మీడియా దిగ్గజం జిమ్మీ లైకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఆయన అరెస్ట్​ను నిరసిస్తూ.. జిమ్మీకి చెందిన యాపిల్ డైలీ సహా ప్రజాస్వామ్య అనుకూల వార్తాపత్రికలను భారీఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చైనా.. కొత్త జాతీయ భద్రతా చట్టం పేరుతో మీడియా గళాన్ని అణిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు హాంకాంగ్ వాసులు.

Hong Kong residents buy newspaper to support free press
వార్తాపత్రికలు కొనేందుకు బారులు తీరిన జనం

ఓ వార్తాపత్రికల వ్యాపారి వద్ద ఉదయాన్నే సుమారు 200 దినపత్రికలు అమ్ముడయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో అతడి వద్ద 100 దినపత్రికలు అమ్ముడుపోవడమే గగనంగా ఉంటుంది.

వార్తా పత్రికలు అమ్ముతున్న ఓ వ్యాపారి

ఇదీ చూడండి: చైనా కక్షసాధింపు- హాంకాంగ్​ మీడియా దిగ్గజం అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.