ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
18 జిల్లాలో ప్రజాస్వామ్య ఉద్యమకారులంతా ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలకు వ్యతిరేకంగా ముసుగులు ధరించి, గొడుగులు చేత పట్టుకొని స్థానిక షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్మోబ్లు నిర్వహించారు. నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని చైనాకు అప్పగించటానికి వీలుగా చట్టం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు.
బ్రిటన్ 1997లో చైనాకు అప్పగించిన తరువాత హాంకాంగ్‌లో ప్రత్యేక స్వయం ప్రతిపత్తి పరిపాలన సాగుతోంది. అయితే ఇటీవలి చైనా దుందుడుకు నిర్ణయాలతో తమ హక్కులకు భంగం కలిగే అవకాశముందని దాదాపు నాలుగు నెలలుగా నిరసనబాట పట్టారు హాంకాంగ్ ప్రజలు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం నిరసనలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.
డిమాండ్లు ఇవే?
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంస్కరణలు, చైనా బిల్లు రద్దు, సార్వత్రిక ఎన్నికలు, ప్రస్తుత రాజ్యాంగ రద్దు, పోలీసుల అరాచకాలపై విచారణ చేపట్టాలని ఆందోళనలు చేస్తున్నారు హాంకాంగ్ ప్రజలు. కానీ బీజింగ్ ప్రభుత్వం, క్యారీ ల్యామ్ నిరసనకారుల డిమాండ్లను నెరవేర్చటంలో సుముఖత చూపటం లేదు.
ఇదీ చూడండి : కాలుష్యం కోరల్లో చిక్కుకున్న రాజధాని నగరం