వారం రోజుల పాటు హాంగ్‌కాంగ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆ దేశ ప్రభుత్వం తెరదించింది. నేరపూరిత కేసుల విచారణ కోసం దేశ పౌరులను చైనాకు అప్పగించే బిల్లును పక్కనబెడుతున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ ముఖ్య కార్యనిర్వాహక అధికారి క్యారీ లామ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
గతవారం నుంచి ఈ బిల్లును వ్యతిరేకించిన వేలాది మంది నిరసనకారులతో హాంగ్‌కాంగ్ వీధులు దద్దరిల్లాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ప్రజల నిరసనలకు తలొగ్గింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: నిరసనలతో హోరెత్తిన హాంగ్‌కాంగ్ వీధులు