డాల్ఫిన్లు ఎక్కువగా ఏ రంగులో ఉంటాయి? బూడిద లేదా నీలం రంగులో కనిపిస్తాయి. అయితే గులాబీ రంగులో ఉన్న డాల్ఫిన్‌ను ఎప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో మీ కోసమే! ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియోలో పింక్ కలర్ డాల్ఫిన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
వియత్నాంలోని హై ఫోంగ్ సిటీ సమీపంలో ఉన్న డు సన్ బీచ్ దగ్గర ఈ వీడియో తీశారు. దీనిని ఇప్పటికే 73వేల మందికి పైగా వీక్షించారు. అందులో బూడిద రంగు డాల్ఫిన్లతో కలిసి గులాబీ రంగు డాల్ఫిన్ ఈత కొట్టడాన్ని మనం గమనించొచ్చు. ఈ కొత్త తరహా డాల్ఫిన్‌పై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. జన్యుపరమైన మార్పుల వల్ల పింక్ కలర్లో డాల్ఫిన్ జన్మించి ఉండొచ్చని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
-
If you haven’t seen a pink dolphin💕
— Susanta Nanda IFS (@susantananda3) August 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Credit in the video) pic.twitter.com/PBZWfmosm0
">If you haven’t seen a pink dolphin💕
— Susanta Nanda IFS (@susantananda3) August 19, 2021
(Credit in the video) pic.twitter.com/PBZWfmosm0If you haven’t seen a pink dolphin💕
— Susanta Nanda IFS (@susantananda3) August 19, 2021
(Credit in the video) pic.twitter.com/PBZWfmosm0
అయితే ఈ పింక్ డాల్ఫిన్లకు బోటో, బుఫియో, అమెజాన్ రివర్ డాల్ఫిన్, పింక్ రివర్ డాల్ఫిన్ అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: పెళ్లి వేదికపై వధూవరులు కబడ్డీ కబడ్డీ!