ETV Bharat / international

కాబుల్​ వర్సిటీలో కాల్పుల కలకలం

అఫ్గానిస్థాన్​ కాబుల్​ విశ్వవిద్యాలయంలో దుండగులు బీభత్సం సృష్టించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

author img

By

Published : Nov 2, 2020, 4:46 PM IST

Gunmen storm Kabul University following explosion near campus
కాబుల్​ యూనీవర్సిటీలో కాల్పుల కలకలం

అఫ్గానిస్థాన్​ కాబుల్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. దుండగుల దాడిలో ఆరుగురికి గాయాలైనట్లు ప్రభుత్వ వైద్యాధికారి అఖ్మల్​ సామ్​సర్ తెలిపారు. సోమవారం అఫ్గాన్​, ఇరాన్​ అధికారులు బుక్​ ఎగ్జిబిషన్​ను ప్రారంభిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు.

కాల్పుల సమయంలో క్యాంపస్​లో తరగతులు నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ ప్రొఫెసర్ జబియుల్లా హైదరీ తెలిపారు. వెంటనే భద్రతా బలగాలతో కలసి విద్యార్థులను బయటకు తరలించామని వివరించారు.

భద్రతా బలగాలు క్యాంపస్​కు వచ్చే దారుల్ని మూసివేశారు. ఏ సంస్థ ఈ దాడికి పాల్పడిందో తెలియాల్సి ఉంది.

గతంలోనూ

2016లోనూ కాబుల్​లోని అమెరికన్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13మంది మరణించారు. గత నెలలో జరిగిన బాంబు దాడిలో 24మంది విద్యార్థులు మరణించగా, సుమారు 100మంది గాయపడ్డారు.

మరోసారి చర్చలు

అఫ్గాన్​ ప్రభుత్వానికీ, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు జరిగినా దాడులు మాత్రం ఆగటంలేదు. ప్రస్తుతం ఖతార్​లోని దోహా నగరంలో మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగా అమెరికా , నాటో సైన్యాల్ని అఫ్గాన్​ నుంచి ఉపసంహరించుకోవాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.