ప్రపంచ సంపద గత రెండు దశాబ్దాల్లో(global wealth report) మూడు రెట్లు పెరిగింది. ఈ మేరకు.. ప్రముఖ కన్సల్టెంట్ దిగ్గజం మెకన్సీ అండ్ కో పరిశోధనాత్మక అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అమెరికాను చైనా(richest country in the world) అధిగమించిందని తెలిపింది. ప్రపంచ ఆదాయంలో 60 శాతం వాటా కలిగి ఉన్న మొదటి పది దేశాల బ్యాలెన్స్ షీట్లను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించింది. 2000 నుంచి 2020 ఏడాది వరకు ఈ 20 ఏళ్ల కాలంలో ప్రపంచ సంపద 156 ట్రిలియన్ డాలర్ల నుంచి.. 514 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు మెకన్సీ తెలిపింది. ఈ 20 ఏళ్లలో చైనా (china news today)సంపద.. 7 ట్రిలియన్ డాలర్ల నుంచి 120 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు అధ్యయనంలో తేలిందని వివరించింది. భారత కరెన్సీ ప్రకారం.. ఇది సుమారు 9వేల లక్షల కోట్ల రూపాయలకు సమానం. అమెరికా సంపద గత 20 ఏళ్లలో రెట్టింపై 90 ట్రిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. భారత కరెన్సీ ప్రకారం అమెరికా సంపద.. 6వేల 750 లక్షల కోట్ల రూపాయలకు సమానం. రెండు అగ్ర దేశాల్లోనూ మూడింట రెండొంతుల సంపద.. 10 శాతం కుటుంబాల వద్దే ఉందని వివరించింది. వారి వాటా క్రమంగా పెరుగుతోందని తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 68 శాతం సంపద రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నట్లు.. మెకన్సీ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. మిగతా మొత్తం మౌలిక సదుపాయాలు, యంత్రాలు, మేధో సంపత్తి, హక్కుల రూపంలో ఉన్నట్లు తేలింది. ప్రపంచ సంపదకు సంబంధించిన అధ్యయనంలో ఆర్థికపరమైన ఆస్తులను లెక్కించలేదని.. మెకన్సీ సంస్థ తెలిపింది. అవి అప్పులు, రుణాలతో ముడిపడి ఉంటాయని పేర్కొంది.
గత రెండు దశాబ్దాల్లో సంపద(global wealth report) పెరగడానికి ప్రధాన కారణం వడ్డీరేట్లు తగ్గడం, ఆస్తుల విలువలు భారీగా వృద్ధి చెందడమేనని మెకన్సీ సంస్థ లెక్కగట్టింది. ఆస్తుల విలువ పెరుగుదల సరాసరి వృద్ధి కంటే 50 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. భూముల విలువ పెరగడం.. చాలా మంది ప్రజల సొంతింటి కలను దూరం చేసిందని పేర్కొంది. ఆర్థిక సంక్షోభం ముప్పును కూడా.. అంతేస్థాయిలో పెంచిందని లెక్కగట్టింది. అమెరికాలో 2008లో ఇదే జరిగిందని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని గుర్తుచేసింది. చైనాలోనూ రుణ సంక్షోభంలో చిక్కుకున్న రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంస్థను ఉదాహరణగా పేర్కొంది.
ఇదీ చూడండి:- బైడెన్, జిన్‌పింగ్ భేటీ- కీలక అంశాలపై చర్చ!