ETV Bharat / international

ఫోన్ వాడేందుకు పరీక్ష... పాసైతే లైసెన్స్ - Media Scout

10-12ఏళ్ల వయసు. తెలిసీ తెలియని ప్రాయం. ఆ సమయంలో చేతికి స్మార్ట్​ ఫోన్​ వస్తే? ఏ యాప్​లు వాడాలి? ఏం పోస్ట్​ చేయాలి? సైబర్​ రౌడీల్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ వ్యవస్థను రూపొందించింది జర్మనీ. ప్రత్యేక పరీక్షలు నిర్వహించి 'మొబైల్​ లైసెన్స్​' ఇస్తోంది.

ఫోన్ వాడేందుకు పరీక్ష... పాసైతే లైసెన్స్
author img

By

Published : Jun 17, 2019, 6:40 PM IST

మీడియా స్కౌట్

ప్రపంచమంతా ఇప్పుడు డిజిటల్ మయం. ఒక్క రోజు చరవాణి వినియోగించకపోతే జీవితం గడవదనే పరిస్థితి. ముఖ్యంగా ఈ తరం చిన్నారుల్లో చాలా మంది చేతిలో ఫోన్లు లేకపోతే భోజనం కూడా చేయడం లేదు. మరి ఈ డిజిటల్​ పరికరాల దుష్ప్రభావాల నుంచి వారిని రక్షించాలంటే? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొంది జర్మనీ. అదే... 'మీడియా స్కౌట్​.'

జర్మనీలోని మూడింట రెండోవంతు చిన్నారులకు 11 ఏళ్లకే సొంత ఫోన్లు ఉన్నాయి. అలాంటి వారికి సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించడం ఈ మీడియా స్కౌట్​ లక్ష్యం. విద్యా బోధనలో ఈ కార్యక్రమాన్ని ఒక భాగం చేశారు.

వాట్సప్​ వంటి మెసేజింగ్ యాప్​లలో ఎలాంటి సందేశాలు పంపొచ్చు...? ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేసినా, మెసేజ్​లు పెట్టినా ఏం చేయాలి? సైబర్​ వేధింపులను ఎదుర్కోవడం ఎలా? ఇలాంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది మీడియా స్కౌట్​.

"అందరి జీవితాల్లో సోషల్​ మీడియా ఒక భాగమైపోయింది. వీటితో జీవితం ఎలా ఉంటుందనే దానిపై విద్యార్థులకు మీడియా స్కౌట్​ వివరిస్తుంది. చరవాణిల నుంచి దూరంగా ఉండటం వల్ల కలిగే ఉపయోగాలను చెబుతుంది."
--- వెర సర్వటి, మీడియా స్కౌట్​ గైడెన్స్​ కౌన్సిలర్

మీడియా స్కౌట్​ శిక్షణ పొందినవారికి 8వ తరగతిలో ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైనవారికి 'మొబైల్​ లైసెన్స్​' లభిస్తుంది. ఆ లైసెన్స్​ ఉంటే నిర్ణీత సమయాల్లో పాఠశాలల్లోనే ఫోన్​ ఉపయోగించుకోవచ్చు.

2011లో ప్రారంభమైన మీడియా స్కౌట్​ కార్యక్రమంలో 766 పాఠశాలలు చేరాయి. 3 వేల 120 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 1,500 మంది ఉపాధ్యాయులు మీడియా స్కౌట్​ గైడెన్స్​ కౌన్సిలర్​గా ఉండి పిల్లలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.