ETV Bharat / international

జపాన్​​ నౌకలో మరో నలుగురు భారతీయులకు కరోనా - జపాన్ క్రూయిజ్​ షిప్​

జపాన్ క్రూయిజ్​ షిప్​లో తాజాగా నలుగురు భారతీయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఫలితంగా డైమండ్​ ప్రిన్సెస్​ నౌకలో ఇప్పటివరకు వైరస్​ సోకిన భారతీయుల సంఖ్య 12కు చేరింది.

Four Indians on board cruise ship test positive for COVID-19, total number of infected Indians rises to 12: Embassy
డైమండ్​ ప్రిన్సెస్​ నౌకలో మరో నలుగురు భారతీయులకు కరోనా
author img

By

Published : Feb 23, 2020, 12:04 PM IST

Updated : Mar 2, 2020, 7:00 AM IST

జపాన్​ డైమండ్​ ప్రిన్సెస్​ నౌకలో తాజాగా మరో నలుగురు భారతీయులకు కరోనా సోకినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వీరందరూ షిప్​లో.. సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నలుగురితో కలిపి క్రూయిజ్​ షిప్​లో కరోనా బారిన పడ్డ భారతీయుల సంఖ్య 12కు చేరినట్లు ధ్రువీకరించింది.

రెండు వారాల నిర్బంధ కాలం ముగిసిన అనంతరం.. వైరస్​ లక్షణాలు లేని కొంతమంది ప్రయాణికులను నౌక నుంచి గతవారమే తరలించారు. మిగతా వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇదివరకు నిర్వహించిన పరీక్షల్లో ఎనిమిది మంది భారతీయులకు కొవిడ్​-19 ఉన్నట్లు గుర్తించారు.

క్రూయిజ్​ షిప్​​లో ఆరుగురు ప్రయాణికులు, 132 మంది సిబ్బంది కలిపి మొత్తం 138 మంది భారతీయులు ఉన్నారు. గత నెలలో హాంగ్​కాంగ్​లో దిగిన ఓ వ్యక్తికి వైరస్​ సోకడం వల్ల టోక్యో సమీపంలోని యొకోహమా పోర్టు వద్ద ఓడను నిలిపేశారు.

Last Updated : Mar 2, 2020, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.