ETV Bharat / international

టాయిలెట్​లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే... - coronavirus latest news

కరోనా మహమ్మారి వ్యాప్తికి కాదేది అనర్హం అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. పబ్లిక్​ యూరినల్స్ ఫ్లష్​ చేసినా వైరస్ కణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు చైనా పరిశోధకులు తాజాగా వెల్లడించారు. మూత్రశాలలకు వెళ్లినా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

Flushing public urinals can spew clouds of virus-laden particles, study says
టాయిలెట్​కు వెళ్లినా మాస్క్ తప్పని సరి.. లేదంటే ప్రమాదమే
author img

By

Published : Aug 19, 2020, 2:52 PM IST

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మరో కీలక విషయాన్ని వెల్లడించారు చైనాలోని యాంగ్​జౌ యూనివర్సిటీ పరిశోధకులు. మూత్రశాలల్లో ఫ్లష్​ చేసినా వైరస్​ కణాలు గాల్లోకి చేరి ఇతరులకు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం 'ఫిజిక్స్ ఆఫ్ ఫ్లుయిడ్స్​' జర్నల్​లో ప్రచురితమైంది.

మలం, మూత్రం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా చైనా శాస్త్రజ్ఞులు నిర్వహించిన పరిశోధనలో యూరినల్స్​ ఫ్లష్ చేసినప్పుడు గ్యాస్​, ద్రవాల కలయికతో జరిగే చర్య ద్వారా వైరస్​ కణాలు గాలి తుంపర్లుగా మారి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఫలితంగా యూరినల్స్​ కూడా కరోనా వ్యాప్తికి కేంద్రబిందువులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే పబ్లిక్​ టాయిలెట్స్​కి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

మూత్ర విసర్జన ద్వారా విడుదలయ్యే చిన్న వైరస్​ కణాలు ఫ్లష్​ చేసినప్పుడు గాల్లోకి వ్యాప్తి చెందేందుకు 35 సెకన్ల వరకు సమయం పడుతుందని పరిశోధకులు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఆహార సంక్షోభం.. పెంపుడు కుక్కలు తినండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.