ETV Bharat / international

కార్మికులపై పోలీసుల కాల్పులు- ఐదుగురు మృతి - చిట్టాగాంగ్​ ఆందోళనల్లో ఐదుగురు కార్మికులు మృతి

బంగ్లాదేశ్​లో కార్మికులు చేస్తున్న ఆందోళనలో ఉద్రిక్తత తలెత్తింది. వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తున్న కార్మికుల్ని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. మరో 20 మంది క్షతగాత్రులయ్యారు.

Bangladesh updates
బంగ్లాదేశ్​లో కార్మికుల నిరసన
author img

By

Published : Apr 17, 2021, 8:13 PM IST

బంగ్లాదేశ్​ చిట్టగాంగ్​లో వేతనాలు పెంచాలని ఆందోళన చేసిన కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది కార్మికులు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

చిట్టగాంగ్​లో చైనాకు చెందిన ఓ కంపెనీ.. థర్మల్​ విద్యుత్​ ప్లాంట్​ నిర్మిస్తోంది. అందులో పనిచేస్తున్న కార్మికులంతా కొంతకాలంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. శనివారం ఉదయం కంపెనీ వద్దకు భారీగా చేరిన కార్మికులు.. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంపెనీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు.

కార్మికుల హింసాత్మక చర్యలను నిలువరిచేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'అణు కేంద్రంపై దాడికి కారకుడు ఇతడే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.