First true millipede: ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 1,306 కాళ్లున్న మిలపీడ్ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. భూమండలంపై మొదటి జంతువైన ఈ జీవికి సంబంధించి మొత్తం 13,000కిపైగా జాతులున్నాయి. అనేక కాళ్ల అకశేరుకాలలో ఇంకా వేల జాతులు ఆవిష్కరణ కోసం, అధికారిక శాస్త్రీయ వివరణ కోసం ఎదురుచూస్తున్నాయి.
మిలపీడ్ అంటే లాటిన్ పదం. వెయ్యి కాళ్లు అనే అర్థం వస్తుంది. తెలుగులో చెప్పాలంటే వీటిని సహస్రపాదులు అంటారు. అయితే ఇప్పటివరకు గుర్తించిన ఏ మిలపీడ్కు కూడా 750కి మించి కాళ్లు లేవు. తొలిసారి వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనిర్సిటీ శాస్త్రవేత్తలు 1,306కాళ్లున్న మిలపీడ్ను గుర్తించినట్లు ప్రకటించారు. ఇది 'యుమిల్లిపెస్ పెర్సీఫోన్' జాతికి చెందింది. పశ్చిమ ఆస్ట్రేలియా దక్షిణ తీరంలోని.. భూగర్భంలో 60మీటర్ల లోతులో దీన్ని కనుగొన్నారు. దీంతో మొట్టమొదటిసారి నిజంగా 1000 కాళ్లున్న మిలపీడ్ను గుర్తించినట్లయింది.
Worlds leggiest animal
ఆస్ట్రేలియాలో అకశేరుకాల సమూహాలలో చాలా జాతులను ఇప్పటికీ వివరించలేదు. వాటి గురించి తెలిసే లోపే అవి అంతరించిపోయే పరిస్థితి ఉంది.
జీవులు ప్రతిచోట ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి జీవులూ ఉండే అవకాశం లేదని పరిశోధకులు ఆశలు వదులుకుంటారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని పిల్బారా, గోల్డ్ఫీల్డ్స్ వంటి మారుమూల ప్రాంతాలు కూడా ఇలాంటి ప్రదేశాలే. శుష్క, కఠినమైన భూమి ఉండే ఈ ప్రాంతం వివిధ జంతు జాతులకు నిలయం కాదని నిపుణులు భావిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నం. ఎవరికీ తెలియని జీవులు ఇక్కడ భూగర్బంలోని రాళ్ల పగుళ్లు, సందులలో జీవిస్తుంటాయి. కొన్ని మీటర్ల లోతులో జీవనం సాగిస్తుంటాయి. ఇప్పుడు కనుగొన్న మిలపీడ్ను కూడా ఇక్కడే ఉంది. రెండు నెలల 60 నిమిషాల పాటు ఇది గోల్డ్ఫీల్డ్స్లోని మైనింగ్ బోర్లోనే గడిపింది.
Eumillipes persephone
1,306 కాళ్ల మిలపీడ్ను కనుగొనడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు బెన్నెలాంగియా ఎన్విరాన్మెంటల్ కన్సల్టంట్స్ ప్రిన్సిపల్ అల్వెజ్ బుజాటో ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ జీవించే జంతువుల గురించి పరిశోధనలు చేయడానికి ఓ మైనింగ్ కంపెనీ తనను నియమించినట్లు చెప్పారు. వెస్టర్న్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ సహకారంతో ఇందులో పాల్గొన్నారు. భూమిపై ఎక్కువ కాళ్లున్న జంతువును తొలిసారి ల్యాబ్లో చూసిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేన్నారు.
Millipede with 1306 legs
మిలపీడ్లు చూడటానికి సన్నగా పొడుగ్గా వందల కాళ్లతో ఉంటాయి. భూఉపరితలంపై వేడి పెరిగి, భూమి ఎండిపోయినప్పుడు భూగర్భంలో తలదాచుకుంటాయి. వేల సంవత్సరాల క్రితం భూమిపై గుర్తించిన మొదటి జంతువు అదే అని కూడా చెబుతుంటారు.
ఇదీ చదవండి: Oral Drug Covid: కరోనాకు నోటి ద్వారా కొవిడ్ టీకా