ETV Bharat / international

'సోషల్​ బబుల్'..​ కరోనా నియంత్రణకు కొత్త అస్త్రం!

author img

By

Published : May 17, 2020, 7:18 AM IST

ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షలు సడలిస్తున్నాయి. అయితే ఇదే అదునుగా కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సోషల్ బబుల్, ట్రావెల్ బబుల్ విధానాల్ని అమలుచేస్తోంది. ఇంతకీ ఇవేంటో మీకు తెలుసా?

What is Social Bubble and Travel Bubble?
సముదాయాల జీవితం

లాక్‌డౌన్‌తో నెలలకొద్దీ ఇళ్లల్లో ఉండిపోయిన ప్రజలు అలసిపోయారు. ఆర్థిక కార్యకలాపాల కోసం మళ్లీ రోడ్లపైకి ఒక్కసారిగా వస్తే వైరస్‌ వ్యాపించేలా ఉంది. ఇంట్లో ఉన్నా, బయటికి వచ్చినా ముప్పు తప్పదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్‌ ప్రభుత్వం 'సోషల్‌ బబుల్', 'ట్రావెల్‌ బబుల్‌' విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఏమిటీ సోషల్‌ బబుల్‌?

ఇది ఒక క్లస్టర్‌ (సముదాయం) వంటిదే. ప్రజలు ఎక్కువ మందిని కలవకుండా నియంత్రించే విధానాన్ని సోషల్‌ బబుల్‌ అంటారు. జనం తాము ఎంపిక చేసుకొన్న కుటుంబాలు/మిత్రులను మాత్రమే కలుసుకొనేందుకు అనుమతి ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం. మనం ఎంత తక్కువ మందితో కలిస్తే అంతగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటామని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ సామాజికశాస్త్ర ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే వైరస్‌ సోకిన వ్యక్తి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ సులువవుతుంది

ఎక్కడ అమలవుతోందంటే?

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న కొన్ని దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌, బెల్జియం, జర్మనీ అమల్లోకి తెచ్చాయి. ఫ్రాన్స్‌, ఆస్ట్రియా, డెన్మార్క్‌లో కూడా 10 మంది వరకు మాత్రమే కలుసుకొనేందుకు అనుమతి ఉంది.

  • జర్మనీలో రెండు కుటుంబాలు మాత్రమే పరస్పరం కలుసుకొనేందుకు అనుమతుంది. వారు మరెవరినీ కలిసేందుకు వీల్లేదు.
  • న్యూజిలాండ్‌లో అత్యంత సన్నిహితులు, ప్రజల్ని కలుసుకొనేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. 'మీ బబుల్‌ను రక్షించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంపిక చేసుకొనే విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారు క్షేమంగా ఉండటంతోపాటు మిమ్మల్నీ సురక్షితంగా ఉంచేవారినే ఎంచుకోండి' అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
  • తమ దేశంలోనూ ఇలాంటి విధానాన్నే ప్రవేశపెడతామని బెల్జియం ప్రధాని సోఫీ విలియమ్స్‌ ప్రకటించారు. ఇక్కడ 'కరోనా బబుల్‌' పేరుతో రెండు కుటుంబాలు మాత్రమే కలుసుకొనేలా ప్రభుత్వం అనుమతులిచ్చింది. బ్రిటన్‌ కూడా ఇటువంటి విధానాన్ని అనుసరించే అంశాన్ని పరిశీలిస్తోంది.

ప్రయాణాలకూ ఇదే సూత్రం..?

ఇది కూడా క్లస్టర్‌ విధానాన్నే తలపిస్తుంది. దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ట్రావెల్‌ బబుల్‌ను సిద్ధం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి, కేసుల సంఖ్య తక్కువగా ఉన్న దేశాలు గ్రూపులుగా వీటిని ఏర్పాటు చేస్తాయి. దేశాల మధ్య సురక్షిత రాకపోకల్ని పునరుద్ధరించడమే లక్ష్యం. ఇది పర్యాటక రంగానికీ ఊతమివ్వనుంది. భవిష్యత్తులో ప్రపంచ రవాణా వ్యవస్థ పునరుద్ధరణలోనూ ఈ నమూనా కీలక పాత్ర పోషించనుందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని తన విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

  • ప్రస్తుతం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలు కొవిడ్‌-19ను సమర్థంగా కట్టడిచేశాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య ప్రయాణాలను పునరుద్ధరిస్తూ ‘ట్రాన్స్‌ టాస్మాన్‌’ ట్రావెల్‌ బబుల్‌ ఏర్పాటు చేసే అంశాన్ని ఇరుదేశాలు తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విధివిధానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే తైవాన్‌, హాంకాంగ్‌లనూ ఇందులోకి చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌లోని కొన్ని దేశాలతోపాటు ఫిన్లాండ్‌, పోలండ్‌ కూడా ఇటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నాయి.
  • బాల్టిక్‌ దేశాలైన ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా ఈనెల 15 నుంచి 'ట్రావెల్‌ బబుల్‌'ను ప్రారంభించాయి. ఇక్కడి ప్రజలు పరస్పరం స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ మూడు దేశాలు కాకుండా బయట నుంచి వచ్చేవారు మాత్రం కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ సడలింపు.. దేశీయ విమాన సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.